ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య లేనట్టే..

AP Has No Dues To Power Gencos - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ డిస్కమ్‌లు.. జనరేటర్లకు రూ.412 కోట్లు బకాయి ఉన్నట్టు చూపించిన ప్రాప్తి పోర్టల్‌ తన పొరపాటును సవరించింది. ఈ బకాయిలను ఇప్పటికే డిస్కమ్‌లు చెల్లించేశాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఏపీలో విద్యుత్ కొనుగోలుకు సమస్య ఇక లేనట్టే.. ఎల్‌పీఎస్-2002 నిబంధనలను ఏపీ డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. ఆగష్టు 5న జనరేటర్లకు రూ.1407 కోట్లు డిస్కమ్‌లు చెల్లించాయి. ప్రస్తుతం నిబంధనల ప్రకారం డిస్కమ్‌లకు ఎలాంటి బకాయిలు లేవు. ఏపీ అధికారుల సమాచారాన్ని ప్రాప్తి పోర్టల్ అప్డేట్ చేసింది.
చదవండి: చంద్రబాబు పాపం.. డిస్కంలకు శాపం

విద్యుత్ మార్కెట్లకు స్వల్పకాలిక యాక్సెస్‌పై పరిమితి తొలగించినట్లు ఇంధన శాఖ కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. నిన్న అర్థరాత్రి నుండి యథాతథంగా విద్యుత్ ఎక్స్ఛేంజీలపై ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా 18న 211 మిలియన్ యూనిట్ల డిమాండ్‌ని డిస్కమ్‌లు రీచ్ అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నామని విజయానంద్‌  పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top