పల్లెలపై ఫోకస్‌

AP Govt has decided to increase monitoring of villages about Covid - Sakshi

కరోనా నియంత్రణకు గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వలంటీర్ల చురుకైన పాత్ర

ప్రతి ఇంటినీ సందర్శించేలా ప్రభుత్వ ఆదేశాలు

సాక్షి, అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించిన నేపథ్యంలో గ్రామాలపై పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీకాలు వేయడంతో పాటు ప్రతి ఒక్కరినీ పరీక్షించాలని.. వైరస్‌ ప్రభావిత వ్యక్తులను వేరుగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తద్వారా వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇవీ మార్గదర్శకాలు
► ప్రతి గ్రామంలో జ్వర బాధితులపై నిఘా ఉంచాలి. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలి. రోజూ ఆరోగ్య ఉప కేంద్రాల్లో జ్వర పరీక్షలు చేయాలి. గంట సేపు గ్రామాల్లో దండోరా వేయించాలి.
► గ్రామ వలంటీర్లతో పాటు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి లక్షణాలున్న వారిని గుర్తించాలి. జ్వర లక్షణాలున్న వ్యక్తి ఇంటికే వెళ్లి ఏఎన్‌ఎంలు పరీక్షించాలి. అలాంటి వారికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌తో పరీక్ష చేయించాలి. ఫలితాలను బట్టి పేషెంట్‌కు వైద్యం చేయాలి.
► ఇళ్లలో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు టెలీ కన్సల్టేషన్‌ అందుబాటులో ఉండాలి. లేదా 104 సేవ ద్వారా సలహా ఇవ్వాలి.    తీవ్రమైన కోవిడ్‌ లక్షణాలుండి, ఆక్సిజన్‌ తక్కువగా ఉంటే మెడికల్‌ ఆఫీసర్‌ దగ్గరకు లేదా కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించాలి.
► ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌లు ఆరోగ్య ఉప కేంద్రాలు, పీహెచ్‌సీలలో అందుబాటులో ఉంచాలి. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ సాంద్రతపై ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలి.
► పల్సాక్సీ మీటర్‌తో ఆక్సిజన్‌ సాంద్రత, థర్మామీటర్‌తో జ్వరం ప్రతిరోజూ నిర్ధారణ చేయాలి.
► 94 కంటే ఆక్సిజన్‌ తక్కువగా ఉంటే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు వెళ్లాల్సిందిగా సూచించాలి. గ్రామాల్లోనే మినీ కోవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. ఇంట్లో ఉండలేని వారిని అక్కడకు తీసుకెళ్లాలి. మినీ కేంద్రాలను వైద్యాధికారి సందర్శించాలి.
► ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామ సచివాలయం ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవచ్చు. పీహెచ్‌సీలో వైద్య పరీక్షలు, వైద్యం అందేలా చూడాలి. 
► గ్రామాల్లో కోవిడ్‌ పరిస్థితులను రోజువారీ పర్యవేక్షించడానికి గ్రామ కమిటీ ఉంటుంది. దీనికి సర్పంచ్‌ చైర్మన్‌గా, ఏఎన్‌ఎంలు సభ్యులు, కన్వీనర్‌గా ఉంటారు. ఆశా కార్యకర్త, గ్రామ వలంటీర్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులు ఉంటారు.
► ఆయా కమిటీలు కోవిడ్‌పై విస్తృత ప్రచారం కల్పించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-05-2021
May 20, 2021, 10:15 IST
వాషింగ్టన్‌: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో అల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు మద్దుతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా...
20-05-2021
May 20, 2021, 09:06 IST
వర్ధన్నపేట: కలిసిమెలిసి ఉంటున్న కుటుంబసభ్యులను కరోనా చెట్టుకొకరు, పుట్టకొకరుగా చేస్తోంది. అసలే చిన్న ఇళ్లు కావడంతో వసతుల్లేక తల్లులను ఇళ్లలో...
20-05-2021
May 20, 2021, 09:04 IST
జైపూర్‌: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారినపడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి...
20-05-2021
May 20, 2021, 07:32 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘ఆరోగ్యం ఎలా ఉంది?.. వైద్యులు బాగా చూస్తున్నారా?.. వేళకు మందులిస్తున్నారా?.. భోజనం బాగుందా?..’ అంటూ గాంధీ ఆస్పత్రి ఐసీయూలో...
20-05-2021
May 20, 2021, 06:23 IST
కొలంబో: శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగాల్సిన ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీ రద్దయింది....
20-05-2021
May 20, 2021, 05:49 IST
సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ సంస్థల నుంచి కరోనా వ్యాక్సిన్‌ డోసులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. కోటి డోసుల...
20-05-2021
May 20, 2021, 05:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది.  బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన...
20-05-2021
May 20, 2021, 05:38 IST
న్యూఢిల్లీ: ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకోవడానికి వీలుగా కొత్త ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ (ర్యాట్‌) కిట్‌కు భారత వైద్య పరిశోధన...
20-05-2021
May 20, 2021, 04:55 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ రోగుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు...
20-05-2021
May 20, 2021, 04:09 IST
సాక్షి, అమరావతి:  బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడిన వారిని ఆరుగురు వైద్యుల బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది. జనరల్‌ ఫిజీషియన్, ఈఎన్‌టీ...
20-05-2021
May 20, 2021, 03:55 IST
సాక్షి, అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ...
20-05-2021
May 20, 2021, 03:00 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులు పలువురు.. డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి సమాచారం...
20-05-2021
May 20, 2021, 02:21 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా జూన్‌ 15వ తేదీ వరకు అందుబాటులో ఉండే...
20-05-2021
May 20, 2021, 02:00 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 చికిత్సలో ఉపయోగించే యాంటీవైరల్‌ డ్రగ్‌ మోల్నుపిరావిర్‌ విషయంలో భారత్‌లో మరో ముందడుగు పడింది. మూడవ...
20-05-2021
May 20, 2021, 01:31 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రధానంగా ఊపిరితిత్తులపై అధిక ప్రభావం చూపిస్తోంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే రెండోదశలో లంగ్స్‌పై వైరస్‌...
20-05-2021
May 20, 2021, 01:08 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా సెకండ్‌ వేవ్‌ ముగింపు దశకు వచ్చిందా? గత 4 రోజులుగా కేసుల్లో తగ్గుదల నమోదవుతుండటాన్ని చూస్తే.....
20-05-2021
May 20, 2021, 00:38 IST
‘కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి. లైట్‌గా జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్‌ని కలవండి’’ అన్నారు పాయల్‌...
19-05-2021
May 19, 2021, 22:12 IST
కొలంబొ: కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు టోర్నమెంట్‌లు రద్దయ్యాయి. ఇటీవలే కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో నిర్వహిస్తున్న...
19-05-2021
May 19, 2021, 19:08 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దెబ్బకు దేశం అతలాకుతలం అయ్యింది. రానున్న రోజుల్లో థర్డ్‌ వేవ్‌ రానుందని.. దాని వల్ల...
19-05-2021
May 19, 2021, 17:27 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికి.. టీకాల కొరత వల్ల అది సాఫీగా సాగడం లేదు. ప్రస్తుతం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top