లోకేష్‌ను ‌ జెడ్‌పీటీసీగా నిలబెట్టి గెలిపించుకోగలరా?

AP Govt Chief Whip Gadikota Srikanth Reddy Comments On Chandrababu Naidu - Sakshi

తాడేపల్లి: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధులు నిర్వహించారని ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారిని శ్రీకాంత్‌ రెడ్డి అభినందించారు. ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యలయంలో విలేకరుల సమావేశంలో గడికోట శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాగా, టీడీపీ ఈ ఎన్నికలను రాజకీయంగా వాడుకొవాలని చూశారని విమర్షించారు. వీరికి పోటీలో నిలబెట్టడానికి అభ్యర్థులు దొరక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడికి దిగారన్నారు. చాలా స్థానాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా  ఏకగ్రీవం కావడం పట్ల టీడీపీ కావాలనే రాద్ధాంతం చేసిందని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. ఏ పార్టీకి ప్రజల్లో​ ఆదరణ ఉందో మున్సిపల్‌ ఫలితాలు చూస్తే తెలిపిపోతుందన్నారు. అయితే , చంద్రబాబు  ఎన్నికల ప్రచారంలో​ ప్రజలను దూశించారని, అందుకే వారు ఓట్లరూపంలో బాబుకు సరైన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. లోకేష్‌ను కనీసం జెడ్‌పీటీసీగా అయినా నిలబెట్టి గెలిపించుకోగలరా అని సవాల్‌ విసిరారు.

ఇప్పటి వరకు దాదాపు 86కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల ఖాతాల్లో చేరాయని తెలిపారు. సంక్షేమం, అభివృద్ది జగన్‌మోహన్‌ రెడ్డికి రెండు కళ్ళని అన్నారు. అయితే, చంద్రబాబుకి మాత్రం దోచుకోవడం, దాచుకోవం మాత్రమే తెలుసన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి హమీని జగన్‌మోహన్‌ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు. కాగా, ఉల్లి ధరలు పెరిగితే సబ్సీడి కింద అందించారని తెలిపారు. కాగా,  75 మున్సిపాలీటిలలో టీడీపీ ఒక్క స్థానం కూడా గెలవలేదని, 12కార్పోరేషన్‌లలో డిపాజిట్‌లు కూడా దక్కలేదన్నారు. చంద్రబాబు, లోకేష్‌ తమ భాషను మార్చుకొవాలన్నారు. కాగా, ఏపీ ఎన్నికల కమీషనర్‌ ఒక రాజ్యంగ బద్ధ పదవిలోఉండి రాజకీయా పార్టీలతో హోటళ్ళలో రహస్యంగా కలవడం దేనికి సంకేతమని అన్నారు. ఇప్పటికైన చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని శ్రీకాంత్‌ రెడ్డి హితవు పలికారు. చంద్రబాబుకు చిత్త శుధ్ది ఉంటే కోర్తులకు వెళ్ళి  స్టేలు తెచ్చుకోకుండా విచారణను ఎదుర్కొవాలని డిమాండ్‌ చేశారు. కాగా, చంద్రబాబు హయాంలో నీరు చెట్టు పేరుతో వేలకోట్లు దోచేశారని, చెత్తతో సంపద సృష్ఠి అన్నారు.. ఎక్కడ సృష్టించారో తెలపాలన్నారు. ప్రజలకు టీడీపీ పార్టీ పట్ల పూర్తిగా నమ్మకం పోయిందని శ్రీకాంత్‌రెడ్డి విమర్షించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top