
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్‌ఆర్ పథకం కింద 573 ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు 148.37 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు మంగళవారం ఆరోగ్య శ్రీ సీఈఓ మల్లీఖార్జున తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతేగాక ఉద్యోగులకు హెల్త్ స్కీం కింద 31.97 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. 544 ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలను కూడా విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.