విధుల్లో ఉన్నప్పుడు రూ.1000 చేతిలో ఉంచుకోవచ్చు

AP Government Employees on Duty in hand Extends to Rs 1000 ACB - Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఉన్న రూ.500 పరిమితిని రూ.1000కి పెంచిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతిలో ఉంచుకునే మొత్తాన్ని ప్రభుత్వం రూ.1000కి పెంచింది. గతంలో ఇది రూ.500గా ఉండేది. మారిన పరిస్థితుల నేపథ్యంలో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది.

జిల్లాలు, హెచ్‌వోడీలు, రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు తమ దగ్గర రూ.500, పర్యటనలో ఉన్నప్పుడు రూ.10 వేలు ఉంచుకోవచ్చని గతంలో నిబంధన ఉండేది. ఏసీబీ దీన్ని సమీక్షించి చేతిలో ఉంచుకునే మొత్తాన్ని రూ.1000కి పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ప్రస్తుతం డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో చేతిలో డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదని తెలిపింది. అయినా ఆ మొత్తాన్ని కొద్దిగా పెంచి రూ.1000కి పరిమితం చేయాలని సూచించింది. దీనికి సాధారణ పరిపాలన శాఖ ఆమోదం తెలిపి జీవో ఇచ్చింది.  

చదవండి: (Ashwini Vaishnaw: ఈ గ్రామాల్లో 4జినే లేదు!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top