కరోనాతో మహిళా వలంటీర్‌ మృతి.. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Ap: Cm Ys Jagan Announces Ex Gratia Lakshmi Family Who Deceased Corona - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లాలో వలంటీర్‌గా పని చేస్తున్న ఎరుసు లక్ష్మీ కరోనాతో మృతి చెందింది. ఆమె రమణయ్య పేట-3 గ్రామ సచివాయం వలంటీర్‌గా పని చేస్తుంది. కరోనా రావడంతో జిజిహెచ్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ లక్ష్మీ కన్నుమూసింది. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్మీ మృతి పట్ల సంతాపం తెలుపుతూ రూ.5 లక్షలను సాయంగా ఆమె కుటుంబానికి అందజేయాలని ఆదేశించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి సాయం అందిస్తామని వ్యవ‌సాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు ప్రకటించారు.

( చదవండి:  ‘వలంటీర్‌’ సేవ; ఆత్మ బంధువులే తోడుగా.. )

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top