పాఠశాల విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

AP CM Jagan Mohan Reddy Review On School Education - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం పాఠశాల విద్యాశాఖపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇంగ్లీషులోనే బోధించాలని, వారితో ఇంగ్లీషు మాట్లాడించటం అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలతో సహా పీపీ-1లలో కూడా ఇంగ్లీష్‌ మీడియం విద్యను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ఏప్రిల్‌ 30న ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. 

అలాగే, జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని.. పిల్లలకు నాణ్యతతో కూడిన ఆహార పదార్ధాలను అందించాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. జగనన్న విద్యాకానుకపై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మళ్లీ స్కూల్స్‌ ప్రారంభమయ్యేనాటికి పిల్లలందరికీ విద్యాకానుక అందాలని ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్‌ఈపై టీచర్లకు అవగాహన, శిక్షణ కల్పించాలని.. విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top