AP CM YS Jagan Cabinet Meeting Today, Check Key Decisions Inside - Sakshi
Sakshi News home page

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

Mar 7 2022 4:11 PM | Updated on Mar 7 2022 4:46 PM

AP Cabinet Meeting Key Decisions - Sakshi

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది.

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై కేబినెట్‌ సంతాపం తెలిపింది. సీఎం వైఎస్‌ జగన్‌, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

చదవండి: అసెంబ్లీ సాక్షిగా టీడీపీ వికృత చేష్టలు.. సీఎం జగన్‌ సీరియస్‌

మంత్రి మండలి కీలక నిర్ణయాలు
స్టేట్‌ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్‌ సోర్సింగ్‌ పోస్టులకు కేబినెట్‌ ఆమోదం.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్‌ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం
కర్నూలుకు చెందిన ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ కెప్టెన్, 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్‌ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు బిల్లుకు  కేబినెట్‌ ఆమోదం. 
తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు.
డిప్యూటీ కంట్రోలర్‌ పోస్టును జాయింట్‌ కంట్రోలర్‌(అడ్మిన్‌) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం.
నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్‌
రూ.1234 కోట్ల రూపాయిలతో మూడు ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం
రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ
ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం.

బెంగుళూరు–కడప, విశాఖపట్నం–కడప నడుమ వారానికి మూడు విమాన సర్వీసులు 
ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు 
వీటికి అదనంగా కొత్త సర్వీసులకు ఆమోదం
మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం
ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్‌ ఒప్పందం.. కేబినెట్‌ ఆమోదం
సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్ధతు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు –2 కింద చెరువులకు నీళ్లు
దీని కోసం బైపాస్‌ కాలువ నిర్మాణం.. రూ.214.85 కోట్ల ఖర్చు. ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్‌– బ్రిడ్జి నిర్మాణం
పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం

పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్‌– బ్రిడ్జి– లాకుల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్‌ ఆమోదం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్‌ ఆమోదం
ఆర్మ్‌డు రిజర్వ్‌ పోర్స్‌లో 17 ఆఫీసర్‌ లెవల్‌ ( 7 ఏఏస్పీ,10 డిఎస్పీ) కొత్త పోస్టులకు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్‌ ఆమోదం
165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్‌ అండ్‌ మెయింటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్‌ కామధేను బ్రీడింగ్‌ సెంటర్‌ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం
మొబైల్‌ ఆంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్‌ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్‌ –2లో  165 మొబైల్‌ వెటర్నరీ క్లినిక్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement