రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం | AP Budget 2024: Cabinet will Approve Vote On Account Budget | Sakshi
Sakshi News home page

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం

Feb 6 2024 8:55 PM | Updated on Feb 6 2024 8:55 PM

AP Budget 2024: Cabinet will Approve Vote On Account Budget - Sakshi

సీఎం జగన్‌తో ఆర్థిక మంత్రి బుగ్గన (పాత చిత్రం)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి భేటీ కానుంది.

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ కానుంది. ఉదయం 8గం. సమయంలో సచివాలయం ఫస్ట్‌ బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. 

ఈ భేటీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అనంతరం.. ఉదయం 9గం. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 11గం. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు బుగ్గన రాజేంద్రనాథ్‌.

Advertisement
 
Advertisement
Advertisement