7,200 కోట్లు ఏం చేశావ్‌..?

AP BJP President Somu Veerraju Fires On Chandrababu - Sakshi

చంద్రబాబుపై సోము వీర్రాజు ఫైర్‌

సాక్షి, విశాఖపట్నం: కృష్ణా పుష్కరాల్లో పలు దేవాలయాలను టీడీపీ నేలమట్టం చేసిందని.. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి హిందుత్వం గుర్తుకు రాలేదా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హిందుత్వంపై దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. కృష్ణా పుష్కరాలలో 17 రకాల దేవాలయాలను తెలుగుదేశం ప్రభుత్వం నేలమట్టం చేసిందని గుర్తు చేశారు. ఆ సమయంలో విజయవాడ గోశాల ప్రాంతాన్ని తాము సందర్శించినపుడు తమపై బుద్దా వెంకన్న దాడికి ప్రయత్నించలేదా అని అన్నారు. ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఒక్క ఆలయాన్ని అయినా కట్టారా అని‌ ప్రశ్నించారు. ‘‘కృష్ణా పుష్కరాలలో ఆలయాలు కూల్చేసినపుడు చినరాజప్ప ఎక్కడున్నారు. ఆ రోజు మాట్లాడని ఈ రాజప్ప ఇపుడు అంతర్వేది ఘటనపై ఎలా మాట్లాడతారు’’ అంటూ సోము వీర్రాజు విమర్శించారు. (చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు)

‘‘అంతర్వేది ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ముఖ్యమంత్రికి లేఖ రాశాం. అనిల్‌కి బంధువంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్‌పై బుచ్చయ్యచౌదరి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. 1996లో లక్ష్మీపార్వతి‌ పార్టీలో ఉండి చంద్రబాబుని బుచ్చయ్య చౌదరి నానాతిట్లూ తిట్టారు. ఆయనలా మేము పార్టీలు మారలేదు. గత 40 ఏళ్లుగా నేను బీజేపీలోనే కొనసాగుతున్నాను. దేశంలో రాజధాని ‌నిర్మాణాలు ఎక్కడ జరిగినా అమరావతి అంత హైప్ ఎక్కడా లేదు. చైనా, జపాన్, సింగపూర్‌లా అమరావతి రాజధాని‌ నిర్మిస్తామంటూ చంద్రబాబు గత ఐదేళ్లూ హైప్ క్రియేట్ చేశారు. జపాన్, సింగపూర్, చైనా అన్నావు కదా.. ఎందుకు అమరావతి నిర్మించలేదని అందరూ చంద్రబాబుని‌ ప్రశ్నించాలి. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన 7,200 కోట్లు ఏం చేశావని చంద్రబాబుని‌ నిలదీయాలి. మాటతప్పిన చంద్రబాబును మీడియా ఎందుకు ప్రశ్నించదు’’ అంటూ సోము వీర్రాజు దుయ్యబట్టారు. (చదవండి: ‘ఈగ కూడా వాలకుండా పచ్చ కండువా కప్పాడు’

(చదవండి: ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top