రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. | AP Assembly Sessions Started From November 11th | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

Nov 10 2024 7:13 PM | Updated on Nov 10 2024 7:15 PM

AP Assembly Sessions Started From November 11th

సాక్షి, అమరావతి: రేపటి(సోమవారం) నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నవంబర్‌ నెలాఖరుతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. బడ్జెట్‌ అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్‌ వాయిదా పడనుంది.

రేపటి నుంచి ఏపీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద​్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరుగుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది. ఈనెల ఆఖరుతో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సమావేశాల్లో కూటమి ప్రభుత్వం కేవలం నాలుగు నెలల కాలానికే బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. సభల్లో బడ్జెట్‌ అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్‌ వాయిదా పడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement