టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు మార‍్షల్స్‌ ఫిర్యాదు | AP Assembly Session 2020: Marshals Complaints To Speaker On TDP MLAs | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు మార‍్షల్స్‌ ఫిర్యాదు

Dec 1 2020 10:01 PM | Updated on Dec 2 2020 4:49 AM

AP Assembly Session 2020: Marshals Complaints To Speaker On TDP MLAs - Sakshi

 సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యేల దాడిపై స్పీకర్ తమ్మినేని సీతారాంకి మార్షల్స్ ఫిర్యాదు చేశారు. సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లడానికి వస్తే తమపై దాడి చేశారని  ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్షల్స్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. కాగా,  సభకు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారనే కారణంగా టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని ఒక్క రోజు పాటు సస్పెండ్‌ చేశారు.  సభ నుంచి వెళ్లాలని స్పీకర్‌ ఆదేశించినప్పటికీ టీడీపీ సభ్యులు అక్కడే ఉన్నారు. దీంతో మార్షల్స్‌ వచ్చి వారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ  ఎమ్మెల్యేలు మార్షల్స్‌పై దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement