AP: ఏఎన్‌యూకి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు | AP: Acharya Nagarjuna University Got Times Higher Education Rank | Sakshi
Sakshi News home page

AP: ఏఎన్‌యూకి టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకు

Sep 17 2021 8:51 AM | Updated on Sep 17 2021 8:51 AM

AP: Acharya Nagarjuna University Got Times Higher Education Rank - Sakshi

ఏఎన్‌యూ: లండన్‌కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ 2022వ సంవత్సరానికి సబ్జెక్ట్‌ వారీగా ర్యాంకులు ప్రకటించింది. వీటిలో ఫిజికల్‌ సైన్సెస్‌ కేటగిరీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) అంతర్జాతీయ స్థాయిలో 1001+ కేటగిరీలో స్థానాన్ని, జాతీయ స్థాయిలో 37వ, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును పొందింది. వర్సిటీలో విద్య, బోధన, పరిశోధనా పత్రాలు, సైటేషన్స్, ఇన్నోవేషన్స్‌ తదితర అంశాల ప్రామాణికంగా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ ఈ ర్యాంకులను కేటాయించింది. ఇందులో స్థానం సాధించడంపై వీసీ ఆచార్య రాజశేఖర్, రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కరుణ, ఆన్‌లైన్‌ ర్యాంకుల కోఆరి్డనేటర్‌ డాక్టర్‌ నాగకిషోర్‌ హర్షం వ్యక్తం చేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement