ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు | Andhra Pradesh New Coronavirus Positive Cases Recorded June 21 | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 2,620 కరోనా కేసులు

Jun 21 2021 4:56 PM | Updated on Jun 26 2021 5:54 PM

Andhra Pradesh New Coronavirus Positive Cases Recorded June 21 - Sakshi

సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,363 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,12,05,849 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

చదవండి: రికార్డు స్థాయిలో వాక్సినేషన్ చేస్తున్నాం: ఆళ్ల నాని


 

Advertisement
 
Advertisement
Advertisement