
ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న ఎమ్యెల్యే సుధీర్‌రెడ్డి
మైలవరం (జమ్మలమడుగు రూరల్): రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం మైలవరం మండలంలోని వేపరాలలో ఎంపీటీసీ–2 ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరినీ అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులుగా ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వారి కార్యకర్తలకే పథకాలు లభించేవని విమర్శించారు. అంతే కాకుండ తెదేపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చెనేతలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు.
జగనన్న చెనేతల కష్టాలను గుర్తించి అర్హులైన ప్రతి చెనేతకు ప్రతి ఏడాది రూ.24 వేలు వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ బడిగించల విజయలక్ష్మీ, ఎంపీటీసీలు నారే రాము, కుమారస్వామి, బడిగించల చంద్రమౌళి, ఎంపీడీఓ వై.రామచంద్రారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వర్‌రెడ్డి, స్థానిక నాయకులు బాలక్రిష్ణ, నాగేంద్ర, శంకర్, శ్రీనివాసులురెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.