ఏపీ: భారీగా పెరిగిన దిశ యాప్‌ డౌన్‌లోడ్లు | Sakshi
Sakshi News home page

Disha App: ఏపీ: భారీగా పెరిగిన దిశ యాప్‌ డౌన్‌లోడ్లు

Published Wed, Jun 30 2021 6:19 PM

Andhra Pradesh: Huge Response For Disha App Downloads Increased - Sakshi

సాక్షి, విజయవాడ: మహిళల రక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్‌నకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ యాప్‌ గురించి అవగాహనా సదస్సు నిర్వహించిన తర్వాత దిశ యాప్ డౌన్‌లోడ్‌ భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. గతంలో రోజుకు 5వేల మంది మాత్రమే ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఇప్పుడు రోజుకు 20వేలకు పైగా డౌన్‌లోడ్‌లు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 

కాగా విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్‌ ఓపెన్‌ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్‌ను గట్టిగా అటుఇటూ ఊపితే చాలు .. యాప్‌ ద్వారా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి మెసేజ్‌ వెళ్తుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్‌కి కాల్‌ చేసి వివరాలు సేకరిస్తారు. పోలీసుల ఫోన్‌కి ఎవరూ స్పందించకపోతే పోలీస్‌ వెహికల్స్‌లో అమర్చిన మొబైల్‌ డేటా టెర్మినల్‌ సహాయంతో జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా బాధితులు ఉన్న లోకేషన్‌కి పోలీసులు వేగంగా చేరుకునేలా ఏర్పాటు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఫోన్లలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement