AP: ప్రభుత్వ పాఠశాలల్లో ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ క్లాసులు 

Andhra Pradesh Govt to Launch Spoken English Classes in Government Schools - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడేలా విద్యాశాఖ మరో ముందడుగు వేసింది. 26 జిల్లాల్లో తొలి దశలో భాగంగా జిల్లాకు 5 హైస్కూళ్లను ఎంపిక చేసి ప్రత్యేక ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. దశల వారీగా అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయనుంది. సాధారణ తరగతులతో పాటే ఆసక్తి కలిగిన విద్యార్థులకు ‘స్పోకెన్‌ ఇంగ్లిష్‌’ నేర్పిస్తారు.   

బెండపూడి.. నిడమానూరులో సక్సెస్‌ 
తూర్పుగోదావరి జిల్లాలోని బెండపూడి, గన్నవరం సమీపంలోని నిడమానూరు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇచ్చిన స్పోకెన్‌ ఇంగ్లిష్‌ శిక్షణతో అద్భుత ఫలితాలొచ్చాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి.. ఆ తర్వాత విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు బోధించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. (క్లిక్: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top