బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు? | Sakshi
Sakshi News home page

బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు?

Published Thu, Aug 18 2022 1:12 PM

TDP MLA Balakrishna Addressed The Students At Hindupuram - Sakshi

సాక్షి, శ్రీ సత్యసాయి: టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మానవత్వం మరచి ప్రవర్తించారు. బాలకృష్ణ నిర్వాకంతో పాఠశాల విద్యార్థులు ఎండలో గంటకు పైగా సమయం నిలబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

.

వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా కొట్నూరులోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసంగించాల్సి ఉండగా.. అక్కడికి గంట లేటుగా వచ్చారు. దీంతో విద్యార్థులు.. ఎమ్మెల్యే రాక కోసం గంటసేపు ఎండలోనే నిలబడ్డారు. దీంతో, ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనంతరం బాలయ్య.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో రాజకీయ ప్రసంగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఇది కూడా చదవండి: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. తత్కాల్‌ టికెట్స్‌పై ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

 
Advertisement
 
Advertisement