వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌లో ఏపీ మరో రికార్డు

Andhra Pradesh Created A Record In Covid Vaccination Special Drive - Sakshi

సాక్షి, అమరావతి: వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డు సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్‌లో మూడు కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి రికార్డు సృష్టించింది. ఆరుకోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్‌ వేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని డోసులు వస్తే రాబోయే రెండు నెలల్లోనే మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ  అధికారులు తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థల సహకారంతో ఏపీలో శరవేగంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.

నేటి స్పెషల్‌ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8.50 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇ‍ప్పటివరకు మొత్తంగా 3,00,87,377 మందికి వ్యాక్సిన్‌ వేశారని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు తొలిడోసును 2,16,64,834 మంది వేసుకోగా..  రెండు డోసులు వేసుకున్నవారు 84,22,543 మందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

చదవండి:  కరోనా వైరస్‌ జన్యు శ్రేణిపై దృష్టి

మూలం కనిపెట్టడంలో అమెరికా విఫలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top