Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP Elections 20204: Amid Results Tough Time To Nara Lokesh In Mangalagiri
సినబాబుకి మరోసారి మంగళమేనా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మూడు శాఖల మాజీ మంత్రి, మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు పరీక్షా సమయమిది. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఈసారైనా గట్టెక్కగలిగితే ఊపిరి పీల్చుకున్నట్లే. లేదంటే రాజకీయంగా అధోగతే అనే అనుమానాలు స్వపక్షీయుల్లోని సీనియర్లు, శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. పోలింగ్‌ అనంతరం విభిన్న కోణాల్లో వేసుకుంటున్న అంచనాలలో అంతర్గత అనుమానాలు అనేకం ఉన్నప్పటికీ బయటకు మాత్రం టీడీపీ గెలుపుపై మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తొలి అడుగులే తడబాటుతో.. రాష్ట్ర విభజనానంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని విస్తతపరచిన నాటి పాలకపక్షానికి గుంటూరు, కష్ణా జిల్లా ప్రజలు తగురీతినే బుద్ధి చెప్పారు. 2019 సాధారణ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీకి కర్రుకాల్చి వాతపెట్టారు. కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్‌ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీలేదనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకష్ణారెడ్డి(ఆర్కే) చేతిలో పరాజయం పాలైన లోకేష్‌ ఆ తరువాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారా అంటే అదీ లేదు. టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 1985 ఎంఎస్‌ఎస్‌ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు. 1994లో సీపీఎం నుంచి రామ్మోహన్‌రావు గెలుపొందారు. బీసీ సామాజికవర్గం నుంచి గోలి వీరాంజనేయులు, మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల విజయం సాధించారు. ఆళ్ల రామకష్ణారెడ్డి రెండు పర్యాయాలు గెలుపొందడానికి పెదకాకాని వాస్తవ్యుడు కావడం, వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉండటం, అన్నిటికన్నా మించి వై.ఎస్‌. కుటుంబానికి సన్నిహితులు కావడం. బీసీలకు చెందిన నియోజకవర్గంగా గుర్తింపున్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయడమంటే సాహసించినట్లేనని లోకేష్‌ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దష్టి సారించిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌ సీపీ వ్యూహాత్మక అడుగులు.. వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు, విద్యావంతురాలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్సార్‌ సీపీ విజయానికి తొలిమెట్టుగా పరిశీలకుల అభిప్రాయం. నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజికవర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే, మామ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. వీటికితోడు ఆ సామాజికవర్గానికి చెందిన స్థానిక సీనియర్‌ నాయకులైన చిల్లపల్లి మోహన్‌రావు, గంజి చిరంజీవి తదితరులకు వైఎస్సార్‌ సీపీ రాష్ట్రస్థాయి పదవులు కట్టబెట్టింది. కార్పొరేషన్ల డైరెక్టర్లుగా, దుర్గగుడి పాలకమండలి సభ్యులుగాను నియమించింది. ఎమ్మెల్యే ఆళ్ల ముందుచూపుతో దుగ్గిరాల (పసుపు) మార్కెట్‌ యార్డు చైర్మెన్‌ పదవిని ఎస్సీ, మైనార్టీలకు, మంగళగిరి ఏఎంసీని యాదవ, పద్మశాలి వర్గీయులకు అప్పగించారు. ఇక పార్టీ నాయకత్వం సోషల్‌ ఇంజినీరింగ్‌లో ఆచితూచి అడుగులేసింది. ఈ విషయంలో టీడీపీ ఎక్కడా సరితూగలేదు. అభివృద్ధికి దిక్సూచిగా.. మంగళగిరి, తాడేపల్లి మండలాలను కలిపి కార్పొరేషన్‌గా చేయడం, ప్రత్యేక గ్రాంటుగా రూ.130 కోట్లను సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కేటాయించడం, ఎవరూ ఊహించని రీతిలో గౌతమబుద్ధ రోడ్డును అభివద్ధి చేయడం, తొమ్మిది అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, సర్వ హంగులతో వై.ఎస్‌.ఆర్‌ క్రీడాప్రాంగణాన్ని తీర్చిదిద్దడం, అంతర్గత రహదారుల విస్తరణ, అభివద్ధి, విభిన్న సామాజికవర్గాల వారికి భవనాలు, కల్యాణ మండపాలను నిర్మించడం, ప్రధానమంత్రి దష్టికి తీసుకెళ్లి అభినందనలు అందుకునేలా పద్మశాలీయులకు మగ్గంలో శిక్షణ ఏర్పాట్లు నెలకొల్పడం తదితరాలు నియోజకవర్గ అభివద్ధికి దిక్సూచిగా నిలిచాయి. పల్లెల్లో డొంకరోడ్లు, సిమెంటు రోడ్లు, అంబేడ్కర్, జగ్జీవన్‌ రామ్, జ్యోతిరావుపూలే, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తదితర ప్రముఖుల విగ్రహాల ఏర్పాట్లు నియోజకవర్గానికి అదనపు హంగులుగా మారాయి. ఆర్కే సొంతంగా నిధులు సమకూర్చడం, అవినీతికి తావు లేకుండా పనులు చేయడం, తరతమ భేదం లేకుండా అన్ని సామాజికవర్గాలకు చేరువగా ఉండటం పార్టీకి అన్నివిధాలా కలిసొచ్చింది. కార్పొరేట్‌ తరహాలో లోకేష్‌ బృందం.. మంగళగిరి నుంచే పోటీచేయాలని నిర్ణయించుకున్న లోకేష్‌ అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేదని స్వపక్షీయులే అంటున్నారు. అధికారంలో ఉన్న సమయంలో కాని, ఆ తరువాతైనా వ్యూహం కొరవడిందంటున్నారు. నియోజకవర్గానికి చుట్టపుచూపుగా రావడం, అతితక్కువ మందిని కలవడం, స్థానికేతరుడు కావడం, ఆయన బందం కార్పొరేట్‌ తరహాలో వ్యవహారాలు నడపడం ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయాయనే విమర్శలు తొలి నుంచే ఉన్నాయి. తోపుడుబండ్లు, బడ్డీ కొట్లు ఇవ్వడం, పెళ్లికానుక పేరుతో రూ.5,000, సుమారు ఓ ఏడాదిపాటు రెండు చోట్ల అన్న క్యాంటీన్లను నడపడం వలన పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ ఉండటాన్ని, లోకేష్‌ అందుబాటులో లేకపోవడాన్ని ప్రజలు బేరీజు వేసుకునే స్థితి. కూటమి నేతలతో అంటీముట్టనట్లు.. ఎన్నికలకు కూటమి కట్టినప్పటికీ నియోజకవర్గంలో జనసేన, బీజేపీలతో అంటీముట్టనట్లే పార్టీ వ్యవహరించిందని టీడీపీ ముఖ్యులే అభిప్రాయపడుతూ వచ్చారు. సమన్వయ సమావేశం కూడా జరగకపోవడం గమనార్హం. ముస్లిం, క్రిస్టియ¯Œ ఓటర్లు దూరమవుతారనే భయంతో బీజేపీ వారిని దరిజేరనిచ్చిన దాఖలాలు దాదాపు లేవు. బీజేపీ, జనసేనలకు చెందిన యడ్లపాటి రఘునాథబాబు, పాతూరి నాగభూషణం, జగ్గారపు శ్రీనివాసరావు, పంచుమర్తి ప్రసాదరావు, పూర్ణచంద్రరావు, శివన్నారాయణ, చిల్లపల్లి శ్రీనివాసరావు, గాదె వెంకటేశ్వరరావు తదితర నాయకులు నియోజకవర్గం వారైనప్పటికీ వారితో కలిసి పనిచేసిన సందర్భాలు తక్కువే. వీరిలో జనసేనకు చెందిన ఒకరిద్దరికి కాస్త ప్రాధాన్యం ఇచ్చారే తప్ప బీజేపీని పట్టించుకోలేదు. సీనియర్‌ నాయకులకే లోకేష్‌ అందుబాటులో ఉండరని, సెక్యూరిటీ వారిని దాటుకుని వెళ్లలేమని, కార్పొరేట్‌ తరహా రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు తమలాంటి వారి సంగతి ఏంటనే ప్రశ్న సామాన్య ఓటర్ల మధ్య చర్చకు దారితీయడం నష్టదాయకంగా మారిందని అంచనా వేస్తున్నారు. లోకేష్‌ చుట్టూ ఆయన సామాజికవర్గం నేతలు చేరడం, తమ వాడైనందున ఓట్లు వేయండని హెచ్చరిక ధోరణిలో చెప్పడం, పెత్తందారీ పోకడలతో వ్యవహరించడం, మా మాట వినకపోతే మీకు ఉపాధి ఉండదని, కౌలుకు భూములు కూడా ఇచ్చేది లేదని కొందరు భయపెట్టే రీతిలో మాట్లాడటం కూడా ఓట్లకు చేటు తెచ్చేవే అనే వ్యాఖ్యానాలు పరిశీలకుల నుంచి వినిపిస్తున్నాయి.:::సాక్షి, ప్రత్యేక ప్రతినిధి

Anticipatory bail for YSRCP Leader Pinnelli Ramakrishna Reddy in three cases
పిన్నెల్లి ఎపిసోడ్‌.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు

సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకు­నేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్‌ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల చర్య చాలా తీవ్రమైనదిఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్‌ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు...ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్‌.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఇవీ షరతులు..పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్‌ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్‌పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్‌ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్‌పోర్ట్‌ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్‌ రోజున ఎస్‌పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్‌ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్‌తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు.

AP State Election Commission Working Under TDP
ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఒక నిబంధనావళి రూపొందించిందంటే అది దేశవ్యాప్తంగా అమలు జరగాలి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నిబంధన అంటూ ఏమీ ఉండదు. అలాగే, గత ఎన్నికల్లో లేని నిబంధన.. అదే విధంగా దేశంలో ఎక్కడాలేని నియమం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అమలు చేస్తున్నారంటే ఏమను­కోవాలి? పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు విషయంలో ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సడలింపులు ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఎందుకంటే.. ఈ సడలింపులు టీడీపీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇచ్చిందని స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి. గత ఎన్నికల్లో లేని సడలింపుల్ని.. పైగా ఇంకెక్కడా లేని మినహాయింపులను ఇక్కడే అమలుచేయడం.. అది కూడా టీడీపీ చెప్పింది చెప్పినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం తలూపుతూ చేయడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎన్నికల సంఘం.. టీడీపీ సంఘంలా వ్యవహరిస్తోందని కాక ఇంకేమనాలి?కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు భిన్నంగా..నిజానికి.. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్‌ వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ.. రాష్ట్రంలో టీడీపీ నేతల విజ్ఞప్తి మేరకు ఈ మార్గదర్శకాలను సడలిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే చాలు.. డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ అధికారి సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకునేలా సడలింపు ఇవ్వడంపై రాజకీయ పక్షాలు నివ్వెరపోతున్నాయి. ఎన్నికల సంఘం పచ్చపాతం మరోసారి బహిర్గతమైందని విమర్శిస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా ఇది వివాదాలకు దారితీస్తుందని.. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.మరీ ఇంత ‘పచ్చ’పాతమా?..పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్‌ ఆఫీసర్లు కొంతమంది సీల్‌ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని.. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాకు టీడీపీ నుంచి పలు విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఆయన.. 2023, జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను ఉటంకిస్తూ ఈనెల 25న ఉత్తర్వులు జారీచేశారు. వాటి ప్రకారం.. డిక్లరేషన్‌ ఫారం మీద అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా (డిజిగ్నేషన్‌) పూర్తి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉండి స్టాంప్‌ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్తంగా అమలవుతోంది. కానీ.. అటెస్టింగ్‌ ఆఫీసర్‌ స్టాంప్‌ లేకపోయినా.. పేరు, డిజిగ్నేషన్‌ వివరాలను చేతితో రాయకపోయినా.. సంతకం ఉంటే చాలు.. దానిపై ఏమైనా అనుమానం వస్తే దాన్ని రిటర్నింగ్‌ ఆఫీసర్, జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంతో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ సడలింపు ఇవ్వడం గమనార్హం.పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదానికి ఇతర నిబంధనలివీ..⇒ పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌ వెనుక రిటర్నింగ్‌ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్‌ పేపర్‌ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్‌ నెంబర్‌ ప్రకారం కౌంటర్‌ ఫైల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్‌ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి.⇒ ఓటరు కవర్‌–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్‌ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్‌ పేపర్‌ ఉండే ఇన్నర్‌ కవర్‌ ఫారం–13బీని తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.⇒ కవర్‌–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్‌ ఫారం లేకపోతే, డిక్లరేషన్‌ ఫారంపై గెజిటెడ్‌ లేదా అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్‌ సీరియల్‌ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్‌ పేపర్‌ తెరవకుండానే తిరస్కరించొచ్చు.⇒ ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్‌ పేపరు తెరిచిన తర్వాత.. ఎవరికీ ఓటు వేయకపోయినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానాస్పద బ్యాలెట్‌ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్‌ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్‌ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్‌ ఆఫీసరు ఇచ్చిన కవర్‌–బీ లేకపోయినా.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరింవచ్చు.

Today Horoscope: Rasi Phalalu 29-05-2024 In Telugu
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ప్రముఖులతో పరిచయాలు

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి ప.1.18 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం: శ్రవణం ఉ.8.41 వరకు, తదుపరి ధనిష్ట వర్జ్యం: ప.12.27 నుండి 1.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.32 నుండి 12.24 వరకు, అమృతఘడియలు: రా.9.31 నుండి 11.02 వరకు. మేషం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థికంగా ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.మిథునం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.కర్కాటకం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.కన్య: విద్యార్థుల కృషి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.వృశ్చికం: కార్యజయం. ఆశ్చర్యకర సంఘటనలు. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనయోగం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.ధనుస్సు: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో పురోగతి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవదర్శనాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.కుంభం: పనులలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయాల సందర్శనం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.మీనం: మానసిక ప్రశాంతత. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

AP Elections 2024: May 29th Political Updates In Telugu
May 29th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 29th AP Elections 2024 News Political Updates..8:20 AM, May 29th, 2024నేడు హైదరాబాద్‌కు చంద్రబాబుఎన్నికల పోలింగ్‌ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.నేడు తిరిగి హైదరాబాద్‌కు రానున్న చంద్రబాబుఇన్నాళ్లు ఎక్కడున్నారో చెప్పని బాబు. 7:30 AM, May 29th, 2024అల్లర్లకు ప్లాన్‌ చేస్తున్నా టీడీపీ..మంత్రి మేరుగు నాగార్జున కామెంట్స్‌..కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఎన్నికల సంఘంచివరకు ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటని ప్రశ్నించిన మేరుగు నాగార్జున కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 ఆగని ‘సంక్షేమం’రాష్ట్రంలో పోలింగ్‌ తర్వాత కూడా ఆగని ‘చేయూత’లబ్ధిదారుల ఖాతాల్లో కొనసాగుతున్న డబ్బుల జమ పోలింగ్‌ అనంతరం 18న రూ. 1,513 కోట్లు24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు20న ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 629 కోట్లుఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందిన మహిళలు 6:50 AM, May 29th, 2024ఈ సడలింపులు.. ‘పచ్చ’సిరాతో!పోస్టల్‌ బ్యాలెట్‌ ఆమోదంపై గతేడాది జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలుదేశవ్యాప్తంగా అవే అమలు కూడా..కానీ, డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ అధికారి స్టాంప్‌ లేకపోయినా.. సంతకం ఉంటే చాలు ఆమోదించాలని టీడీపీ విజ్ఞప్తిఆ మేరకు సడలింపు ఇస్తూ ఈనెల 25న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులుఅటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకంపై అనుమానం వస్తే ఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి వద్ద సంతకంతో సరిపోల్చుకోవాలని ఆదేశాలుఇది పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో వివాదాలకు దారితీస్తుందంటున్న రాజకీయ పక్షాలు.. శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందంటూ ఆందోళనరాష్ట్ర ఎన్నికల సంఘం మరీ ఇంత ‘పచ్చ’పాతంపై విస్మయం 6:40 AM, May 29th, 2024ఈసీ అంపైర్‌లా లేదుదానికి చంద్రబాబు వైరస్‌ సోకింది.. వారంలో టీడీపీ పీడ విరగడఅధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనేగీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదువైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరికసీఈసీ మార్గదర్శకాలు దేశమంతా ఒకేలా ఉండాలి..పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించేందుకు బాబు కుట్రఅందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డికి మాచర్ల టికెట్‌చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయంగోబెల్స్‌ ప్రచారం చేసి.. వ్యక్తిత్వహననంతో అధికారులను లొంగదీసుకునే యత్నంఅందులో భాగమే సీఎస్‌పై అభూతకల్పనలతో కథనాలు 6:30 AM, May 29th, 2024కౌంటింగ్‌లో అప్రమత్తత అవసరం ఫలితాలు వెలువడే వరకు ఏమరుపాటు పనికిరాదుఅనుమానాలు నివృత్తి చేసుకోవాలి.. కౌంటింగ్‌ ఏజెంట్ల జాబితా 31లోగా అందివ్వాలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు సజ్జల రామకృష్ణారెడ్డి సూచన

Nawaz Sharif says Pakistan violated 1999 Lahore Declaration signed with delhi
లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించటం పాక్‌ తప్పే: నవాజ్‌ షరీఫ్‌

లాహోర్‌: పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీష్‌ భారత్‌తో చేసుకున్న ఒప్పదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను,అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంతకాలు చేసిన ‘లాహోర్‌ డిక్లరేషన్‌’ఒప్పందం ఉల్లంఘించామని తెలిపారు. ఆయన మంగళవారం పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్‌) పార్టీ సమావేశంలో మాట్లాడారు.‘మే 28, 1998న పాకిస్తాన్ ఐదు అణుబాంబు పరీక్షలు చేపట్టింది. అనంతరం భారత్‌ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి లాహోర్‌కు వచ్చారు. ఆయన మాతో లాహోర్‌ ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆ ఒప్పందాన్ని మేం ఉల్లంఘించాము. అది మా తప్పే. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ ఉద్దేశపూర్వకంగా అగ్రిమెంట్‌ను అతిక్రమించారు’ అని అన్నారు.మార్చి,1999లో ముషారఫ్‌ పాక్‌ ఆర్మీకి ఫోర్ స్టార్‌ జనరల్‌గా ఉన్నారు. లడ్డాక్‌లోని కార్గీల్‌లో రహస్యంగా చొరబాడటానికి ఆదేశించారు. ఈ విషయంతో అప్రమత్తమైన ఇండియా యుద్ధం చేసి విజయం సాధించింది. ఆ సమయంలోనే తాను ప్రధానిగా ఉ‍న్నానని నవాజ్‌ షరీఫ్‌ గుర్తుచేశారు. పాకిస్తాన్‌ మొదటి అణు బాంబు పరీక్షించి 26 ఏళ్లు అవుతోందని తెలిపారు.‘అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ఆనాడు పాక్‌.. అణుపరీక్ష ఆపేందుకు 5 బిలియన్‌ డాలర్లను ఇస్తానని ఆఫర్‌ చేశాడు. కానీ, నేను అమెరికా అఫర్‌ను తిరస్కరించాను. ఆ సమయంలో మాజీ ప్రధానిగా ఇమ్రాన్‌ ఉండి ఉంటే క్లింటన్‌ ఆఫర్‌కు అంగీకరించేవాడు’అని ఇమ్రాన్‌పై విమర్శలు గుప్పించారు.లాహోర్‌ డిక్లరేషన్‌ ఇరు దేశాల మధ్య ఏర్పాటు చేసుకున్న శాంతి ఒప్పందం. ఈ ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు 21, ఫిబ్రవరి 1999లో సంతాకాలు చేశారు. అనంతరం పాకిస్తాన్ జమ్ము కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడటంతో యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధంలో భారత్‌ విజయం సాధించింది. ఇక..ద తాజాగా మంగళవారం నవాజ్‌ షరీష్‌ మరోసారి పీఎంఎల్‌-ఎన్‌ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

RBI Launches Mobile App For Retail Direct and Fintech Repository And Pravaah Portal
ఆర్‌బీఐ మొబైల్‌ యాప్‌

ముంబై: రిటైల్‌ మదుపుదార్లు ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని సులభతరం చేసే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించింది. దీనితో పాటు నియంత్రణపరమైన అనుమతులకు సంబంధించి ప్రవాహ్‌ పోర్టల్, ఫిన్‌టెక్‌ సంస్థల డేటా కోసం ఫిన్‌టెక్‌ రిపాజిటరీని ప్రారంభించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మంగళవారం ఈ మూడింటిని ఆవిష్కరించారు. ప్రస్తు తం చిన్న ఇన్వెస్టర్లు రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా గవర్నమెంట్‌ సెక్యూరిటీస్‌ (జీ–సెక్‌)లో ఇన్వెస్ట్‌ చేయడానికి వీలుంది. ఇందుకోసం రిటైల్‌ డైరెక్ట్‌ స్కీము కింద ఆర్‌బీఐ వద్ద రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంటును తెరవాల్సి ఉంటోంది. దీన్ని ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్లే స్టోర్‌ నుంచి, ఐవోఎస్‌ యూజర్లు యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 60 ఫారంలతో ప్రవాహ్‌.. నియంత్రణ సంస్థపరమైన వివిధ రకాల అనుమతులకు సంస్థలు, వ్యక్తులు దర ఖాస్తు చేసుకునేందుకు ప్రవాహ్‌ పోర్టల్‌ ఉపయోగపడుతుంది. వివిధ విభాగాలకు సంబంధించి ఇందులో 60 అప్లికేషన్‌ ఫారంలు ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని పెంచనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. అప్లై చేసుకున్న వారు నిర్దిష్ట దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు, అలాగే దానిపై తీసుకున్న నిర్ణయాన్ని నిర్ణీత వ్యవదిలో దరఖాస్తుదారుకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఫిన్‌టెక్‌ రిపాజిటరీ.. ఫిన్‌టెక్‌ సంస్థలు, వాటి కార్యకలాపాలు, టెక్నాలజీపరంగా చేకూరే ప్రయోజనాలు మొదలైన డేటాకి ఈ రిపాజిటరీ కేంద్రంగా ఉంటుంది. ఫిన్‌టెక్‌ కంపెనీలను నియంత్రణ సంస్థ కోణంలో మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, వాటికి తగిన విధానాలను రూపొందించేందుకు ఇది ఉపయోగపడగలదు. నియంత్రిత సంస్థలు, ఆర్‌బీఐ నియంత్రణలో లేని ఫిన్‌టెక్‌లు కూడా ఈ రిపాజిటరీకి సమాచారం సమరి్పంచవచ్చు.మరోవైపు, ఆర్‌బీఐ నియంత్రణలో మాత్రమే ఉన్న సంస్థలు (బ్యాంకు లు, బ్యాంకింగ్‌యే తర ఆర్థిక సంస్థలు) వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి సంబంధించిన వివరాల కోసం ఎంటెక్‌ (ఈఎంటెక్‌) రిపాజిటరీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఫిన్‌టెక్, ఎంటెక్‌ రిపాజిటరీలను ఆర్‌బీఐ అనుబంధ సంస్థ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) నిర్వహిస్తుంది.

Gangs Of Godavari Pre Release
ఇండస్ట్రీ నుంచి పంపించేస్తారు అన్నారు: విశ్వక్‌ సేన్‌

‘‘నిజాయతీగా పని చేసి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ లాంటి మంచి సినిమా తీశాం. అందుకే ఈ మూవీపై చాలా నమ్మకంగా ఉన్నాం. అందరూ కుటుంబంతో కలిసి రావొచ్చు. సినిమా చూశాక రెండు మూడు రోజుల పాటు ప్రేక్షకుల మనసుల్లోనే ఉంటుంది’’ అని హీరో విశ్వక్‌ సేన్‌ అన్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా, నేహా శెట్టి, అంజలి కథానాయికలుగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీ రిలీజ్‌ వేడుకలో హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ– ‘‘ఐదేళ్ల క్రితం మార్చి 31వ తేదీనే నా ‘ఫలక్‌నుమా దాస్‌’ రిలీజ్‌ అయ్యింది. నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆ సినిమా.. ఆదరించిన ప్రేక్షకులే. నా కెరీర్‌ ఆరంభంలో ‘ఇలాంటి యాటిట్యూడ్‌ ఇండస్ట్రీలో పనికి రాదు.. తొక్కేస్తారు.. పంపించేస్తారు’ అన్నారు. అయినా నా క్యారెక్టర్‌ మార్చుకోలేదు. ఐదేళ్లుగా నన్ను సపోర్ట్‌ చేస్తున్న ఇండస్ట్రీకి, దర్శక–నిర్మాతలకు, ముఖ్యంగా నా ఫ్యాన్స్‌కి థ్యాంక్స్‌. ఇప్పటికే ఐదేళ్లు గడిచిపోయాయి.మరో ఐదేళ్లు ఫైనల్‌.. కాల్చిపడేస్తా మొత్తం. రత్నలాంటి పాత్ర చేయాలన్నది నా కల. అలాంటి కథతో వచ్చిన కృష్ణ చైతన్యకి థ్యాంక్స్‌. నేను ఇప్పటి వరకూ పనిచేసిన నిర్మాతల్లో నాగవంశీ బెస్ట్‌’’ అన్నారు. కృష్ణ చైతన్య మాట్లాడుతూ– ‘‘మా అమ్మానాన్నల ఆశీస్సుల వల్లే ఇక్కడ ఉన్నాను. మా గురువు త్రివిక్రమ్‌గారే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’కి మూలం. ఆయన వల్లే ఈ సినిమా మొదలైంది. నన్ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతలు చినబాబు, నాగవంశీ, సాయి సౌజన్యగార్లకు కృతజ్ఞతలు. బుజ్జిగా నేహాశెట్టి, రత్నమాలగా అంజలి పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.విశ్వక్‌ సేన్‌ అద్భుతంగా నటించాడు. తను చేసిన రత్న పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది’’ అన్నారు. సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 31 తర్వాత విశ్వక్‌ సేన్‌ గురించి మాట్లాడుకుంటే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’కి ముందు, తర్వాత అని మాట్లాడు కుంటారు. నట విశ్వరూపం చూపించాడు. సినిమా చూశాక నిజంగా కృష్ణ చైతన్య తీశాడా? అనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఇంటెన్స్‌ మూవీ రాలేదు’’ అన్నారు. నటి నేహా శెట్టి, నటులు మధునందన్, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Women benefited from schemes irrespective of elections: AP
ఆగని ‘సంక్షేమం’

సాక్షి, అమరావతి: ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా ముందుగానే సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించి ఠంఛన్‌గా ఆయా పథకాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వం ఎన్నికల అనంతరం కూడా పథకాల అమలు కొనసాగిస్తూ వస్తోంది. ఎన్నికల కోడ్‌ కారణంతో మధ్యలో నిలిచిన వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, ఈబీసీ నేస్తం పథకాల లబ్ధిదారులకు ఈ 13న పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయా పథకాల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది.ఒక్కో మహిళకు రూ. 18,750ల చొప్పున 18న వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా రూ. 1,513.78 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. 24న మరో రూ. 200 కోట్లు, 27న ఇంకో రూ. 400 కోట్లు ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. మిగిలిన వారికి కూడా పంపిణీ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు.రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు నాలుగు విడతల్లో రూ. 75 వేల మొత్తం అందించేలా వైఎస్సార్‌ చేయూత పథకం అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో విడతగా పంపిణీ చేస్తున్న రూ. 5,060.49 కోట్లతో కలిపి ప్రభుత్వం గత ఐదేళ్లలో 26,98,931 మందికి ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్లు అవుతుంది. పోలింగ్‌ ముగిసిన మర్నాటి నుంచే ఐదేళ్లగా కొనసాగుతున్న పథకాలే అయినప్పటికీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో టీడీపీ, జనసేనల ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా పథకాల అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే పోలింగ్‌ ముగిసిన మరుసటి రోజు మే 14న 21.56 లక్షల మంది పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌ ఆసరా పథకానికి సంబంధించి రూ. 1,843.07 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో 2019 ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని వైఎస్సార్‌ ఆసరా పథకం పేరిట ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా అందజేసే ప్రక్రియ పూర్తయింది.2019 ఏప్రిల్‌ 11 నాటికి 78.94 లక్షల మంది మహిళలకు రూ.25,570 కోట్లు అప్పు ఉండగా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆ మొత్తం రుణాన్ని ప్రభుత్వం అందించింది. మరోవైపు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అగ్ర వర్ణాల్లోని 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అర్హులైన పేద మహిళలకు ఈ విడతలోను రూ.15 వేలు చొప్పున లబ్ధిదారులు అందరికీ చెల్లించాల్సిన మొత్తం రూ. 629 కోట్లను చెప్పిన ప్రకారమే పోలింగ్‌ ముగిసిన తర్వాత ఈ నెల 20న వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు.

Lok Sabha Elections 2024 Muslim Vote Bank Factor
ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?

2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఆరు దశల ఓటింగ్ పూర్తయ్యింది. ఏడో దశకు జూన్‌ ఒకటిన పోలింగ్‌ జరగనుంది. దేశంలో హిందువుల జనాభా 80 శాతం. ముస్లిం జనాభా 14 శాతం. అసోం, పశ్చిమ బెంగాల్‌లలో అత్యధిక ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. ఈ సారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉండనుంది?గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లకు సంబంధించిన సీఎస్‌డీఎస్‌ లోక్‌నీతి అందించిన డేటా ప్రకారం 2009 ఎన్నికలలో బీజేపీకి నాలుగు శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 58 శాతం ముస్లిం ఓటర్లు ఇతర పార్టీలకు ఓటు వేశారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 38శాతం ముస్లిం ఓట్లు, ఇతర పార్టీలకు 54 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 33 శాతం, ఇతరులకు 59 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయి.2014 ఎన్నికల్లో 882 మంది ముస్లిం అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 23 మంది మాత్రమే విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 819 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో 28 మంది మాత్రమే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 27 మంది ముస్లిం ఎంపీలు పార్లమెంటుకు చేరుకున్నారు.ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అమితాబ్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే ముస్లిం ఓటర్లు తటస్థంగా మారిపోతున్నారు. ఇందుకు పలు కారణాలున్నాయి. 2014కు ముందు అసోంలో ముస్లిం ఓట్లు కేంద్రీకృతమై ఉండేవి. హిందూ ఓట్లు కులాల ప్రాతిపదికన చెల్లాచెదురయ్యాయి. ఫలితంగా అసోం, యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయి. 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే ఈ రాష్ట్రాల్లో బీజేపీకి తొమ్మది సీట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో బీజేపీ పరిస్థితి బాగానే ఉందని తివారీ పేర్కొన్నారు.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement