'కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే'

Anam Vijay Kumar Reddy Counter To Kotamreddy Allegations - Sakshi

నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎ‍మ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆనం విజయ్‌కుమార్ రెడ్డి. జిల్లాలో అనవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అధిష్టానం గుర్తిస్తేనే ఎవరైనా ఎమ్మెల్యే కాగలరని పేర్కొన్నారు. కోటంరెడ్డి పార్టీలో గుర్తింపు లేదనడం భావ్యం కాదన్నారు.

పార్టీ నుంచి వెళ్లాలని కోటంరెడ్డికి ఎవరూ చెప్పలేదని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు. నెల జీతాలిచ్చి రౌడీషీటర్లను పెట్టుకొని దందాలు చేసిన వ్యక్తి ఆయన అని వ్యాఖ్యానించారు. హింసా రాజకీయాలు చేసి నీచ సంస్కృతికి తెరలేపారని ధ్వజమెత్తారు. కోటంరెడ్డి సోదరులు రాక్షసులుగా వ్యవహరించారని ఫైర్ అయ్యారు. 

కౌన్సిలర్ స్థాయి కూడా లేని కోటంరెడ్డిని సీఎం జగన్ ఎమ్మెల్యేని చేశారని విజయ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు.  ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కోటంరెడ్డి బ్రదర్స్ తినే ప్రతి మెతుకు సీఎం జగన్ పెట్టిన భిక్షే అన్నారు. టీడీపీతో కుమ్మక్కై అన్నం పెట్టిన పార్టీపై అభాండాలు మోపుతారా అని ప్రశ్నించారు. 

తన సోదరుడు ఆనం రామనారాయణరెడ్డి కూడా ఏం తక్కువై పార్టీకి దూరమయ్యారో తెలియడం లేదని విజయ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ తమ కుటుంబానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. పార్టీ లైన్ దాటితే ఎంతటి వారికైనా చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. రామనారాయణరెడ్డి తమ్ముడిగా కాకుండా సీఎం జగన్ మనిషిగా ఉంటానని పేర్కొన్నారు.

చదవండి: ఇంకేం చర్యలు తీసుకుంటాం.. కోటంరెడ్డి వ్యవహారంపై స్పందించిన సజ్జల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top