చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుఫాన్ కారణంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేకాధికారి, రాష్ట్ర పర్యాటకశాఖ ఎండీ ఆమ్రపాలికి సోమవారం కలెక్టరేట్‌లో ఘన స్వాగతం లభించింది. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావులతో పాటు జిల్లా పర్యాటకశాఖాధికారి రామ్‌లక్ష్మణ్‌రావు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె జిల్లాలోని తుఫాన్ పరిస్థితులను జేసీ నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


