చిలకలపూడి(మచిలీపట్నం): మోంథా తుపాను పరిశీలన కృష్ణా జిల్లా ప్రత్యేకాధికారిగా కె.అమ్రాపాలిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, గాలులు వీయనున్న నేపథ్యంలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగ కుండా, అధికారులను అప్రమత్తం చేసేందుకు జిల్లాకు ప్రత్యేకాధికారిగా ఆమెను నియమించారు. అమ్రాపాలి సోమవారం కలెక్టరేట్‌కు వస్తారని అధికారులు తెలిపారు.


