పోలవరం పూర్తి చేసేది మేమే: మంత్రి అంబటి

Ambati Rambabu Key Comments On Polavaram Project In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవలం పూర్తి అయితే ఏపీకి అనేక లాభాలు ఉన్నాయన్నారు. 

అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. పోలవరానికి మొదట్లో శ్రీరామపాద సాగర్‌ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌గా మార్చారు. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిచే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్‌ సస్యశ్యామలం చేయాలని ఆనాడు భావించి మహానేత వైఎస్సార్‌ జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోపాటు మహానేత వైఎ‍స్సార్‌ అన్ని అనుమతులు తీసుకువచ్చారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్సార్‌ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్‌ను సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం తీసుకువచ్చారు. పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్‌ అని ఉంటుంది. పోలవరం పూర్తి చేసేది మేమే. మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది. ఇది దైవ నిర్ణయం. మా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ. 2,600 కోట్ల పెండింగ్‌ నిధులు కేంద్రం నుంచి రావాలి అని స్పష్టం చేశారు. 

పోలవరం చంద్రబాబు ఏటీఎం..
ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు. విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. పోలవరానికి అయ్యే ప్రతీ పైసాను కేంద్రమే భరిస్తుంది అని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్‌ అయినా మేమే కడతాం అని చంద్రబాబు అన్నారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?. 2013, 2014 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. అందుకు చంద్రబాబుకు కూడా అంగీకరించారు. తర్వాత పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. చంద్రబాబు హయాంలో 48 శాతం మాత్రమే ప్రాజెక్ట్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం జరిగింది. పోలవరాన్ని తామే నిర్మాస్తామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో దోచుకో.. పంచుకో.. తినుకో అన్న పద్దతిలో పోలవరం నిధులను చంద్రబాబు కాజేశారు. 

రామోజీ బంధువుదే నవయుగ.. 
రామోజీకి అ‍త్యంత సమీప బంధువులదే నవయుగ కంపెనీ. అలాంటి నవయుగ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్‌ ఇచ్చారు. చంద్రబాబుకు డబ్బులు కావాల్సినప్పుడల్లా పోలవరం నిధులను వాడుకున్నారు. టీడీపీ హయాంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణం కాకుండానే కాఫర్‌ డ్యాంల నిర్మాణం చేపట్టారు. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే గత వరదల్లో తీవ్ర నష్టం జరిగింది. మీరు నాశనం చేసిన డయాఫ్రం వాల్‌ను మేము కట్టాము. టీడీపీ తప్పిదం వల్ల రూ.2022 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: లోకేష్‌ యాత్రలో డబ్బుల గోల.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top