అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం: చట్ట ప్రకారమే ముందుకెళ్లండన్న సుప్రీం కోర్టు

Amara Raja Batteries: Supreme Court Key Orders To AP PCB - Sakshi

సాక్షి, ఢిల్లీ: అమర్ రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా.. షోకాజ్ నోటీస్ పై పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం  నిర్ణయం తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే.. పీసీబీ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని అమర్‌ రాజాకు సూచించింది న్యాయస్థానం. 

ఏపీ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేసిన సంగతి తెలిసిందే. అయితే.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదించారు. ఈ తరుణంలో న్యాయస్థానం.. రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందే అని స్పష్టం చేసింది.  

అమర్ రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, పరిసర ప్రాంతాల జలాల్లో  లెడ్ కంటెంట్ పెరిగిందని  గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి. జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై.. గతంలో అధికారుల విధులను అడ్డుకున్నందుకు పోలీసు కేసు నమోదైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top