ఒబెరాయ్‌ హోటల్‌కు 20 ఎకరాల కేటాయింపు

Allotment of 20 acres for Oberoi Hotel Andhra Pradesh - Sakshi

లీజ్‌ కమ్‌ రెంట్‌ విధానం

ఏపీ టూరిజం ఎండీ కన్నబాబు 

తిరుపతి అలిపిరి/ జమ్మలమడుగు/మధురపూడి(రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్‌  ప­ర్యా­టక రంగం అభివృద్ధిలో భాగంగా తిరుపతి అలి­పిరి రోడ్డులో టూరిజం స్థలం 20 ఎకరాలను ఒబెరాయ్‌ హోటల్‌కు లీజ్‌ కమ్‌ రెంట్‌ విధానంలో కేటా­యించే విషయమై ఒప్పంద పత్రాలను మార్చుకున్న­ట్టు టూరిజం ఎండీ కన్నబాబు తెలిపారు. శని­వారం మధ్యాహ్నం స్థానిక అలిపిరి రోడ్డులోని దేవలోక్‌ వద్ద ఒబెరాయ్‌ హోటట్‌ ప్రతినిధులతో ఈ ఒ­ప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దాదాపు రూ.­100 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని తెలి­పారు.    

గండికోటలో స్థలం పరిశీలన
వైఎస్సార్‌ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఒబెరాయ్‌ బృందం పర్యటించింది. ఒబెరాయ్‌ హోట­ల్‌ సీఈవో, ఎండీ విక్రమ్‌ ఒబెరాయ్, కార్పొరేట్‌ అ­ఫెర్స్‌ ప్రెసిడెంట్‌ శంకర్, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ కల్లోల్‌ కుందా,ఎంఏఎల్‌ రెడ్డి, మహిమాసింగ్‌ ఠాగూర్‌  బృందం  పర్యటించింది. ఈ సందర్భంగా నాలుగు వందల ఎకరాల స్థలాన్ని పరిశీలించారు.

గతేడాది ఒబెరాయ్‌ హోటల్‌ యాజమాన్యం గండికోటలో రిసార్టులను ఏర్పాటు చేస్తామని, భూమిని కేటాయించాలని కోరడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఒబెరాయ్‌ యాజమాన్యానికి 50 ఎకరాల భూమిని కేటాయించింది. దీంతో రూ.250 కోట్లతో 120 విల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  దాదాపు 40 నిమిషాల పాటు ఒబెరాయ్‌ బృందం గండికోటలోని వివిధ ప్రాంతాలను పరిశీలించింది. పెన్నానదిలోయ అందాన్ని తిలకించారు. 

పిచ్చుక లంక, హేవలాక్‌ బ్రిడ్జి అభివృద్ధిపై ఒబెరాయ్‌ ప్రతినిధులతో కలెక్టర్ల చర్చ
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్ర­సి­­ద్ధి గాంచిన హేవలాక్‌ బ్రిడ్జి, పర్యాటక కేంద్రమైన పిచ్చుక లంక అభివృద్ధిపై ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రతి నిధులతో తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్లు కె.మాధవీలత, హిమాన్షుశుక్లా, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ చర్చించారు.

తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్తూ మధురపూడి విమానాశ్రయంలో ఆగిన ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రతినిధులతో శనివా­రం రాత్రి సమావేశమై పిచ్చుక లంక, హేవలాక్‌ బ్రిడ్జి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగాన్ని విస్తరించవచ్చని వివరించారు. భేటీలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ చి­ర్ల జగ్గిరెడ్డి, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top