గంట్యాడ ఘటనపై మంత్రి ఆళ్ల నాని ఆరా

Alla Nani Enquiry About Students Tested Corona Positive In Gantyada - Sakshi

సాక్షి, విజయనగరం : గంట్యాడలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా రావడం పట్ల డిప్యూటీ సీఎం , వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని శనివారం స్పందించారు. ఈ విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ అంశంపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. కరోనా సోకిన 20 మంది విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ హైస్కూల్లో మొత్తం 108 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. 20 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. అయితే కరోనా సోకిన విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కరోనా పరీక్షలు చేయాలని డీఎమ్‌హెచ్‌వోను కూడా సూచించినట్లు తెలిపారు. (చదవండి : ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు)

ఒకవేళ కరోనా సోకిన విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేకపోతే హోంక్వారంటైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ క్వారంటైన్‌లో ఉండే విద్యార్థులకు ప్రతి రోజు వైద్య బృందం వారి ఆరోగ్యం పై ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్న కోవిడ్ విద్యార్థులకు ప్రత్యేక మెడికల్ కిట్స్ అందచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.కరోనా సోకకుండా అన్ని పాఠశాలల్లో మాస్కులు, శానిటైజర్స్ వినియోగించే విధంగా అవగాహన కల్పించాలని కోరుతూ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top