ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు | 60 Lakh Above Coronavirus Test Made For People In Andra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో 60 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Oct 3 2020 6:11 PM | Updated on Oct 3 2020 8:27 PM

60 Lakh Above Coronavirus Test Made For People In Andra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 72,861కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..  6,224 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో60,21,395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 7,798 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,51,791గా ఉంది. కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 41 మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5941కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 55,282 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 11.84 శాతంగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement