Agnipath Protests: Visakhapatnam, Guntur railway stations High Alert - Sakshi
Sakshi News home page

అగ్నిపథ్‌ నిరసనలు.. విశాఖ రైల్వేస్టేషన్‌ మూసివేత

Published Sat, Jun 18 2022 8:59 AM

Agnipath Protests: Visakhapatnam, Guntur railway stations High alert - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అగ్నిపథ్‌ నిరసనల నేపథ్యంలో విశాఖలోని పలు రైల్వేస్టేషన్‌ల వద్ద భారీగా భద్రత పెంచారు. ఆర్‌పీఎఫ్‌, జీఆర్పీ లోకల్‌ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను సీపీ శ్రీకాంత్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ  రైల్వే స్టేషన్లపై దాడులు పాల్పడవచ్చుననే సమాచారం ఉంది. విశాఖ రైల్వేస్టేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాము. ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. యువత కేసుల్లో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.

విస్తృతంగా తనిఖీలు
అగ్నిపథ్‌ నిరసనల నేపథ్యంలో విశాఖ నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అనుమానం ఉన్న వారిని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు. బస్సులు, బైకులు, ఆటోలు, కార్లు ఆపి తనిఖీలు పోలీసులు నిర్వహిస్తున్నారు. 

రైల్వేస్టేషన్‌ మూసివేత
అగ్నిపథ్‌ నిరసనల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల వరకు విశాఖ రైల్వే స్టేషన్ మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వస్తున్న ప్రయాణికులను వెనక్కి పంపిస్తున్నారు. విజయవాడ వైపు వెళ్లే వాళ్లు, వచ్చే వాళ్ళు దువ్వాడ వెళ్లాలని, కోల్‌కత్తా, ఒరిస్సా వైపు నుంచి వచ్చే వాళ్లు, వెళ్లేవాళ్లు కొత్తవలస వెళ్ళాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
 

Advertisement
Advertisement