తిరుపతి రూరల్ : యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని సిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్సపొందుతూ బుధవారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీకి చెందిన కిరణ్‌కుమార్ యూట్యూబ్ వేదికగా తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ‘అగ్గిపెట్టె మచ్చ’ పేరుతో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన చేసిన కామెడీ వీడియోలు, వినోదాత్మక కార్యక్రమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. కిరణ్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పలువురు యూట్యూబర్లు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారి్థంచారు. గురువారం చిగురువాడ పంచాయతీ వైఎస్సార్ కాలనీలోని ఆయన సోదరి ఇంటి వద్ద నుంచి అగ్గిపెట్టె మచ్చ అంతిమయాత్ర మొదలకానున్నట్లు కుటుంబీకులు తెలిపారు.


