
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 1.48 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరింతమంది దరఖాస్తు చేసుకునేందుకు కోవిన్ సాఫ్ట్‌వేర్‌ను ఓపెన్ చేస్తున్నారు. 18 ఏళ్లు దాటిన వారైతే సెకండ్‌వేవ్ భయంతో ఎక్కువమంది వ్యాక్సిన్‌కు ముందుకు వస్తున్నారు. వ్యాక్సిన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మన రాష్ట్రంలో రోజుకు 6 లక్షల మందికి వేసే సామర్థ్యం ఉండటంతో తగినంత టీకా వస్తే మూడు మాసాల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.