సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ | MLA Vasupalli Ganesh Meets CM YS Jagan Mohan Reddy At Tadepalli | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌

Sep 19 2020 2:25 PM | Updated on Sep 19 2020 3:36 PM

YSRCP MlAs Meets CM YS Jagan Mohan Reddy At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ నేత వాసుపల్లి గణేష్‌ కలిశారు. శనివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో తన కుమారులతో కలిసి ఆయన ...ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మ్మెల్యే కుటుంబంతో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై విశ్వాసం సన్నగిల్లడంతో తెలుగు తమ్ముళ్లు దారి వెతుక్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇవాళ ముఖ్యమంత్రిని కలిశారు. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు మాటలను వాసుపల్లి గణేష్‌ ఇప్పటికే విభేదించారు. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రిని వాసుపల్లి గణేష్ కుమార్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమారులు ఇద్దరూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 


Advertisement
 
Advertisement
Advertisement