Andhra Pradesh: రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు | 750 electric buses to transform public transport in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్‌ బస్సులు

Apr 27 2026 3:18 AM | Updated on Apr 27 2026 3:18 AM

750 electric buses to transform public transport in Andhra Pradesh

సీఈఎస్‌ఎల్‌ సీఈవో అఖిలేష్‌ కుమార్‌ దీక్షిత్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్‌ బస్సులను కేటాయించినట్లు కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్విసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌) సీఈవో అఖిలేష్‌కుమార్‌ దీక్షిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను విస్తరించేందుకు 3,604 ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు కోసం సీఈఎస్‌ఎల్‌ టెండర్‌ పిలిచిందని పేర్కొన్నారు.

దీని ద్వారా 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో విద్యుత్‌ ఆధారిత రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు 750 బస్సులు కేటాయించగా, వీటిలో విశాఖపట్నానికి 150, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement