చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి | 4 Killed In Road accident At Chandragiri In Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

Feb 18 2022 1:20 PM | Updated on Feb 18 2022 2:15 PM

4 Killed In Road accident At Chandragiri In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు. 

బోల్తాపడిన కారు
నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన కారు మార్చాల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులు మహబూబాబాద్‌కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుప్రతికి తరలించారు.

టీచర్‌ మృతి
మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్ మండలం బోరాజ్‌ చెక్‌పోస్టు వద్ద జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఉపాధ్యాయురాలు పద్మ మరణించారు. బైక్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. 

Advertisement
 
Advertisement
Advertisement