వాగులో కొట్టుకుపోయిన యువకుడు

A 28 Year Old Man  Misiing  while Crossing River In Krishna district - Sakshi

కృష్ణా : వాగు దాటుతుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ 28 ఏళ్ల వ్య‌క్తి కొట్టుకుపోయిన ఘ‌ట‌న కృష్ణా జిల్లా కొటికలపూడిలో చోటుచేసుకుంది. వివ‌రాల ప్ర‌కారం మైల‌వ‌రం మండ‌లం గ‌ణ‌ప‌వ‌రానికి చెందిన న‌వీన్ అనే వ్య‌క్తి ఎద్దుల‌బండిపై కోటికలపూడి వైపు వెళ్తుండ‌గా ఒక్క‌సారిగా వ‌ర‌ద ఉధృతి ఒక్క‌సారిగా పెరిగింది. దీంతో అత‌ను వ‌ర‌ద‌నీటిలో కొట్టుకుపోయాడు. గ‌ల్లంతైన వ్య‌క్తి కోసం గ్రామ‌స్తులు గాలిస్తున్నారు. (లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయాలి: మంత్రి ఆదేశం)

ర‌హ‌దారిపై నిలిచిన వ‌ర్షం
గత రెండురోజులుగా కురుస్తున్న  భారీ వర్షాలకు  గన్నవరం పోలీస్ స్టేషన్ ప్రాంగణం జలమయమైంది. దీంతో  ఫిర్యాదుదారులు ఇబ్బంది పడకుండా  సీఐ కె.శివాజీ ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. మ‌రో వైపు కంచిక‌చ‌ర్ల  వద్ద 65వ‌ నెంబర్  జాతీయ రహదారిపై రెండు అడుగుల మేర నీటి ప్రవాహం నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జాం త‌లెత్తింది. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top