15 Years of Sakshi: జన హృదయాల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర

15 Years Sakshi Effect: Kanigiri People Water Problem Solution

కనిగిరి ప్రజల క‘న్నీటి’ సమస్యకు చెక్‌

మార్కాపురం, ఒంగోలు, కనిగిరిలో డయాలసిస్‌ మిషన్ల పెంపు

ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛ జలాలు.. రూ.530 కోట్లతో కృష్ణా జలాలు

కనిగిరి రూరల్‌: అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తూ.. తెలుగు పత్రికా రంగంలో సంచలనంగా ఆవి­ర్భవించి.. అడుగులు ముందుకు వేసిన ‘సాక్షి’  15 వసంతాలు పూర్తి చేసుకుని, 16వ ఏట అడుగు పెట్టింది. నిఖా­ర్సైన జర్నలిజా­నికి నిలువుటద్దంగా నిలి­చింది. తెలుగు ప్రజల్లో ‘సాక్షి’ చెరగని ముద్ర వేసుకుంది. ఈ 15ఏళ్లలో ఎన్నోకథనాలను ప్రచురించింది. అందులో కొన్ని..

ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ నీటి వల్ల ప్రజ­లు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారనే విషయంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచు­రించింది. దీనిపై 2017 జనవరిలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ కనిగిరి నియోజకవర్గంలోని పీసీ­పల్లిలో దీక్ష చేపట్టారు. ఆ వెంటనే అప్పటి టీడీపీ ప్రభుత్వం కనిగిరిలో డయాల­సిస్‌ సెంటర్‌ మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది.
చదవండి: పూర్తి చేసేది మేమే

వైఎస్‌ జగన్‌ సీఎం కాగానే ఏకంగా 17 డయాలసిస్‌ మిషన్లు ఏర్పాటు చేశారు. మార్కాపురం, ఒంగోలు రిమ్స్‌లో డయాలసిస్‌ మిషన్ల సంఖ్యను భారీగా పెంచారు. సమస్య మూలాలపై దృష్టి సారించి కృష్ణా జలాలు అందించేందుకు శ్రీకారం చుట్టారు. రూ.130 కోట్లతో ఏఐఐబీ స్కీం కింద కనిగిరి పట్ట­ణానికి సమగ్ర మంచి నీటి పథకం మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.400 కోట్లతో నియోజకవర్గంలోని ఆరు మండ­లా­ల్లోని 442 గ్రామాలకు సురక్షిత జలాలను అందించేందుకు వాటర్‌ గ్రిడ్‌ పథ­కా­న్ని మంజూరు చేశారు. నీటి ఎద్దడి తీ­వ్ర­ంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా ఆర్‌డ­బ్ల్యూఎస్, పంచా­యతీ­రాజ్‌ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేస్తు­న్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top