తాడిపత్రిటౌన్: భర్త తాగుడు మానడంలేదని భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం తాడిపత్రిలో చోటు చేసుకుంది. పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసముంటున్న చాకలి నాగేంద్ర భార్య చాకలి మల్లేశ్వరి (41 ) కులవృత్తి చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి 25 ఏళ్ల క్రితం వివాహమైంది. గత కొద్ది నెలలుగా అనారోగ్యం పాలైన నాగేంద్ర తాగుడుకు బానిసయ్యాడు. ఎంత చెప్పిన భర్త తీరు మారకపోవడంతో విసిగిపోయిన మల్లేశ్వరి సోమవారం సాయంత్రం విషద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృరాలికి కుమారుడు, కూతురు ఉంది. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


