బస్తా బియ్యం కోసం బారులు | - | Sakshi
Sakshi News home page

బస్తా బియ్యం కోసం బారులు

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

అనంతపురం అగ్రికల్చర్‌: బియ్యం ధరలు అమాంతం పెరగడంతో రైతు బజారులో బియ్యం బస్తా (సబ్సిడీ) కోసం నగరవాసులు బారులు తీరారు. ఉదయం 7గంటల నుంచే పదుల సంఖ్యలో ప్రజలు బియ్యం కోసం వేచివున్న పరిస్థితి. రైతు బజార్‌లో కేవలం ఒక కౌంటర్‌ మాత్రమే ఏర్పాటు చేయడంతో ఒక్క బస్తా కోసం ఐదారు గంటలపాటు నిలబడాల్సి వస్తోంది. బియ్యం కోసం వచ్చిన సామాన్యుల పరిస్థతిని అధికారులు చూస్తున్నా అధికారులు మరో కౌంటర్‌ ఏర్పాటు చేయకపోవడంపై అనంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్‌లో నిల్చున్న వారికి పౌరసరఫరాలశాఖ, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆధార్‌కార్డు ఉన్న వారికి కిలో రూ.49, మరో రకం రూ.50 ప్రకారం 26 కిలోల బస్తా పంపిణీ చేస్తున్నారు. స్టాకు లేదని ఓ రోజు.. మరో కారణంతో మరోరోజు ఇలా తరచూ పంపిణీ చేయకపోవడంతో పనులన్నీ వదులుకుని వస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఉల్లి స్టాల్‌లో స్టాకు సరిగా లేకపోవడంతో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.

26 కేజీల ప్యాకెట్‌ కోసం ఐదారు గంటల పాటు పడిగాపులు

ఒకే కౌంటర్‌ ఉండడంపై ఆగ్రహం.. సంఖ్య పెంచాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement