గుంతకల్లు: పట్టణానికి చెందిన ముగ్గురు చిన్నారులు అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్స్‌లో సత్తా చాటినట్లు మాస్టర్ చెస్ అకాడమీ కోచ్‌లు అనిల్, రామారావులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఎఫ్‌ఐడీఈ) ఈ నెల విడుదల చేసిన ర్యాపిడ్ రేటింగ్స్ జాబితాలో అండర్–9 విభాగంలో దాక్రేష్ మహావర్ 1553, జె.శ్రీరిషిత్ 1529లో సత్తా చాటగా, అండర్–11 బాలికల విభాగంలో ఛాయాదేవి మఠం పత్రి 1458 రేటింగ్‌తో రాణించినట్లు చెప్పారు. గుంతకల్లుకు చెందిన ముగ్గురు చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో రేటింగ్ సాధించడం ఇదే ప్రథమన్నారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు.
తాగడానికి అప్పు ఇవ్వలేదని వ్యక్తిపై హత్యాయత్నం
పామిడి: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని ఇంటి యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం రాత్రి పామిడిలో చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ నాగరాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మెయిన్‌బజార్‌లోని బొడ్రాయి వీధికి చెందిన పారిశ్రామికవేత్త, భోగేశ్వరాలయ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎన్.మురళీధర్‌గుప్తా ఇంట్లో వరలక్ష్మి పనిమనిషిగా చేస్తోంది. ఆమె అత్యవసర పనిమీద వెళ్తే వాళ్ల చెల్లెలు, గుత్తి మండలం ఈశ్వునిపల్లికి చెందిన ఎర్రిస్వామి భార్య శ్రీదేవి పనిచేసేది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 – 9 గంటల సమయంలో శ్రీదేవి భర్త ఎర్రిస్వామి తాగడానికి డబ్బు అప్పుగా ఇవ్వమన్నాడు. దీనికి మురళీధర్ నిరాకరించడంతో ఎర్రిస్వామి తాగిన మైకంలో కత్తితో మురళీధర్‌గుప్తా గొంతు, ముఖంపై దాడి చేసి గాయపరిచి, పరారయ్యాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అవార్డు గ్రహీతలకు అభినందన
అనంతపురం: సాంకేతిక విద్యారంగంలో విశేష కృషి, నైపుణ్యం కనబరిచిన జేఎన్‌టీయూఏ ప్రొఫెసర్లకు ప్రతిష్టాత్మక ‘భారతీయ సాంకేతిక విద్యా పరిషత్’(ఐఎస్‌టీఈ) ఆంధ్రప్రదేశ్ అవార్డులు – 2026 దక్కాయి. సీఎస్‌ఈ విభాగంలో ప్రొఫెసర్ ఎ.పి.శివకుమార్, ఈఈఈ విభాగంలో డాక్టర్ కె. జితేంద్ర గౌడ్ అవార్డులు వరించాయి. ఈ నెల 7న విశాఖపట్నంలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఐటీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జేఎన్‌టీయూ – గురజాడ విజయనగరం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.వెంకట సుబ్బారావు, జేఎన్‌టీయూఏ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.రంగా జనార్ధనల చేతుల మీదుగా వీరు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు సోమవారం ఉదయం జేఎన్‌టీయూఏ వీసీ హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.దుర్గా ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.దిలీప్ కుమార్ తదితరులు అభినందించారు.
దాక్రేష్ మహావీర్, జె.శ్రీరిషిత్,
ఛాయాదేవి మఠం పత్రి


