గూండాగిరి చేస్తామంటే ప్రజలు ఊరుకోరు | - | Sakshi
Sakshi News home page

గూండాగిరి చేస్తామంటే ప్రజలు ఊరుకోరు

Nov 10 2026 12:13 AM | Updated on Nov 10 2026 12:13 AM

గుంతకల్లుటౌన్‌: స్థానిక ఎన్నికల్లో గూండాగిరి చేసినట్టు సార్వత్రిక ఎన్నికల్లోనూ చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, రాళ్లతో తరిమికొడతారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన పార్టీ కౌన్సిలర్లు, ముఖ్యనేతలతో సమావేశమై మాట్లాడారు. బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరహాలో పక్క జిల్లా నుంచి గుంతకల్లుకు వచ్చి దోపిడీలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే జి.జయరాం తీరును విమర్శించారు. ప్రశాంతంగా ఉండే నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నాయకులు హింసాత్మక ఘటనలకు తెరలేపారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీకుండా అడ్డుకున్నారని, అడ్డదారుల్లో గెలిచిన అధికార పార్టీ నాయకులకు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. అధికార పార్టీకి సహకరించిన పోలీసులు, అధికారులను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చట్టం ముందు నిలబడతామని స్పష్టం చేశారు. సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల విజయం తథ్యమని తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకల రామాంజినేయులు, పట్టణ అధ్యక్షుడు ఖలీల్‌, నూర్‌నిజామీ,కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

అడ్డదారుల్లో కాదు.. దమ్ముంటే మళ్లీ పోటీ చేసి గెలవండి

కూటమి నేతలకు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్‌ సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement