● విజేతలుగా కృష్ణా, అనంతపురం జిల్లా జట్లు
లేపాక్షి: మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు సోమవారంతో ముగిశాయి. అండర్–19 బాలబాలికల కేటగిరీలో జరిగిన పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన జట్లు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. బాలికల విభాగంలో విజేతలుగా ఉమ్మడి కృష్ణా జిల్లా నిలువగా, పశ్చిమగోదావరి జిల్లా జట్టు రన్నర్స్‌గా, విశాఖపట్నం జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో విజేతలుగా అనంతపురం జిల్లా, గుంటూరు జిల్లా ద్వితీయ స్థానం, కృష్ణా జిల్లా తృతీయ స్థానంలో ప్రతిభ కనబరిచారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన బాల, బాలికల జట్టు(12 మంది)ను జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మొరార్జీ యాదవ్ పేర్కొన్నారు. జాతీయస్థాయికి ఎంపికై న వారు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో డిసెంబరు 8 నుంచి 12 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. అనంతరం నిర్వాహకులు ట్రోఫీలు అందజేయడంతో పాటు ప్రతిభ చాటిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్ నాగరాజు, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శిలు రాగేష్, సత్యనారాయణ, సంధ్యారాణి, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.


