కళ్యాణదుర్గం: మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీడీపీ ఓటమి భయంతో అడ్డదారులు తొక్కింది. అభ్యర్థులను గెలిపించుకునేందుకు రిగ్గింగ్‌కు పాల్పడింది. కళ్యాణదుర్గంలో వైఎస్సార్‌సీపీకి పట్టు ఉన్న వార్డుల్లో ఓసారి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మరోసారి ఆయన తనయుడు యశ్వంత్, ఇంకోసారి వ్యక్తిగత కార్యదర్శి రాకేష్, టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గోళ్ల వెంకటేశులు, టీడీపీ నాయకులు డిష్ మురళి, అబ్దుల్ రహీం, ప్రకాష్‌తో పాటు పలువురు టీంలుగా ఏర్పడి దొంగ ఓట్లు వేయించేందుకు యత్నించారు. దొడగట్టలోని ఒకటి, రెండు వార్డుల్లో ఎమ్మెల్యే చాటున 40 మంది పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి రిగ్గింగ్ చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చేశారు. పార్టీ శ్రేణులను పోలీసులు బయటకు పంపించేశారు. అనంతరం టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడగట్ట నారాయణ చేతికి గాయం అయ్యింది.
దొడగట్టలో రీ పోలింగ్ జరపాలి
ఎమ్మెల్యే అమిలినేని బెదిరింపులకు పాల్పడి రిగ్గింగ్ చేసుకోవడం సరైంది కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోలింగ్ నిర్వహించి గెలిచి చూపాలి. సీఐ హరినాథ్ నాతో పాటు మా బంధువు అయిన మాజీ ఎంపీపీ రామలక్ష్మమ్మ, విజయలక్ష్మిపై దాడి చేశారు. సీఐని సస్పెండ్ చేయాలి. – దొడగట్ట నారాయణ,
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి


