శెట్టూరు: అనుంపల్లిలో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని బోయ నాగరాజు, భార్య చౌడక్క తన కుమారుడు చంద్రశేఖర్‌తో కలిసి శుక్రవారం రాత్రి ఇంటి బయట నిద్రపోయారు. శనివారం ఉదయం 5 గంటటకు నిద్రలేచిన చౌడమ్మ ఇంటి తలుపు తీసి విద్యుత్ స్విచ్ ఆన్ చేసింది. దీనితో ఒక్కసారిగా పెద్దశబ్దంతో ఇంటి తలుపులు ఎగిరిపడ్డాయి. కిటకీల అద్దాలు, ఇంట్లోని బీరువాలు పెద్ద శబ్దంతో పగిలిపోయాయి. శబ్దానికి బయట ఉన్న భర్త నాగరాజు ఏం జరుగుతోందని ఇంటి లోపల చూస్తే చౌడమ్మ మంటల్లో చిక్కుకుంది. వెంటనే ఒక పెద్ద దుప్పటతో కప్పి దొరలించి మంటలను ఆర్పివేశాడు. చుట్టు పక్కల వారి సాయంతో ఆమెను అంబులెన్స్ ద్వారా కళ్యాణదుర్గం అసుపత్రికి తరలించారు. ఘటనలో సుమారు రూ.8 లక్షల ఇల్లు, వస్తువులు ధ్వంసమైనట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


