మద్యం మత్తులో పీఈటీపై దాడి | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పీఈటీపై దాడి

Nov 1 2026 4:31 AM | Updated on Nov 1 2026 4:31 AM

విడపనకల్లు: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పీఈటీపై దాడి చేసిన ఘటన కరకముక్కల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు..శనివారం గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని పంపాలంటూ బోయ అజయ్‌ అనే వ్యక్తి పీఈటీ శివకుమార్‌ను అడిగాడు. అతను మద్యం మత్తులో ఉండటంతో విద్యార్థినిని పంపడం కుదరదని, అమ్మాయి తల్లిదండ్రులు వస్తే పంపుతానని చెప్పాడు. వెంటనే అతడు పీఈటీని కిందపడేసి విచ్చలవిడిగా కాళ్లతో తన్ని మెడపైన, భుజాలపై దాడి చేశాడు. ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాల హెచ్‌ఎం పాల్తూరు పోలీసులకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. దీంతో వారు పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించారు. అననంతరం పాఠశాల హెచ్‌ఎం అజ్మతుల్లా బాషా పీఈటీపై దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విలేకరులపై దురుసుగా ప్రవర్తించిన

టీడీపీ నాయకులు

ఘటనపై న్యూస్‌ కవరేజ్‌ కోసం వెళ్లిన విలేకరులపై స్థానిక టీడీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement