పక్షపాతం చూపిన ఏ అధికారినీ వదిలిపెట్టం | - | Sakshi
Sakshi News home page

పక్షపాతం చూపిన ఏ అధికారినీ వదిలిపెట్టం

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

బుక్కరాయసముద్రం: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పక్షపాతం చూపే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను ఎవరినీ వదిలి పెట్టబోమని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సిద్దరాంపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఓటర్లను భయబ్రాంతులను చేసే విధంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై కత్తులతో, ఇనుప రాడ్లతో, కట్టెలతో రాళ్లతో దాడులకు తెగబడుతున్నారన్నారు. పోలీసులు, అధికారులు కూడా ఏక పక్షంగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవడం శోచనీయమన్నారు. చాలా చోట్ల పోలీస్‌స్టేషన్లలో దాడులకు గురైన బాధితులపైనే తిరిగి కేసులు కూడా నమోదు చేస్తున్నారన్నారు. బీకేఎస్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పరోక్షంగా కూటమి నాయకులకు సహకారం అందిస్తూ చిన్న పొరపాట్లను ముందుగానే కూటమి నాయకులకు తెలియజేయడం దారుణమన్నారు. తిరస్కరణ పేరుతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులకు కనీసం పత్రాలను కూడా సరిగా ఇవ్వకపోవడంపై సరికాదన్నారు. నామినేన్ల ఉపసంహరణలో కూడా అధికారులు కూటమి నాయకులకు పరోక్షంగా సహకరించారని విమర్శించారు. పక్షపాతం వహిస్తున్న అధికారులను గుర్తు పెట్టుకుంటామని, ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్‌ సాకే రిత్విక్‌, జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లే సుజాత, భాస్కర్‌, పార్వతి, నరేష్‌, ఈశ్వరరెడ్డి, కొండారెడ్డి, నాగుముణి శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement