యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

● పింఛన్‌దారులకు టీడీపీ నేతల ప్రలోభాలు

● పింఛన్‌ కొనసాగాలంటే టీడీపీకి ఓటు వేయాల్సిందేనని హుకుం

పామిడి/గుత్తి రూరల్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు, ప్రలోభాలు, బెదిరింపులు తారస్థాయికి చేరాయి. టీడీపీకి ఓటు వేయకపోతే పింఛన్లు తొలగిస్తామంటూ బహిరంగంగానే బెదిరిస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం పింఛన్ల పంపీణీలో స్థానిక టీడీపీ నేతలు బరి తెగించారు. పింఛన్ల పంపిణీలో నేరుగా పాల్గొని..టీడీపీ కరపత్రాలతో పాటు పింఛన్‌ డబ్బు పంపిణీ చేశారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేయకపోతే వచ్చే నెల నుంచి పింఛన్లు ఆపేస్తామని హెచ్చరించారు. పామిడి మండలం గజరాంపల్లిలో శుక్రవారం చేపట్టిన పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారు. గ్రామ టీడీపీ నేత ఎల్‌.హనుమంతరెడ్డి దగ్గరుండి పింఛన్‌దారులకు మొత్తాలను పంపిణీ చేయడం గమనార్హం. అలాగే గుత్తి మండల పరిధిలోని చాలా గ్రామాల్లో పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు.

గుత్తి మండలం జక్కలచెరువులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న టీడీపీ నాయకుడు

పామిడి మండలం గజరాంపల్లిలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న టీడీపీ నాయకుడు హనుమంతరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement