ఘనంగా సర్మస్‌ హుస్సేనీ ఉరుసు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సర్మస్‌ హుస్సేనీ ఉరుసు

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

బొమ్మనహాళ్‌: మండలంలోని దర్గాహొన్నూరు సర్మస్‌ హుస్సేనీ స్వాముల ఉరుసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అనేక ప్రాంతాల నుంచి దర్గాకు తరలివచ్చిన భక్తులు స్వామివారికి చాదర్‌, పూలమాలలు, చక్కెర సమర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలకు దర్గా ఆవరణలో చక్కెర తూకాలతో మొక్కులు చెల్లించుకున్నారు. రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్‌ ఎస్‌ఐ నబీరసూల్‌ ఆధ్వర్యంలో పోలీసులలతో బందోబస్తు నిర్వహించారు. శనివారం ఉదయం తెల్లవారుజామున సర్మస్‌ హుస్సేనీ షంషేర్‌ నిర్వహించనున్నట్లు ఆలయ 8వ పీఠాధిపతులు సయ్యద్‌ రహంతుల్లా హుసేన్సీ, సయ్యద్‌ ఖాజా ఫీరా హుసెన్సీ, సయ్యత్‌ ఇనాయత్‌ బాబా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement