సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి

Oct 31 2026 4:58 AM | Updated on Oct 31 2026 4:58 AM

● ఎస్కేయూ వైస్‌ చాన్సలర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతికుమార్‌

అనంతపురం: సాంకేతిక పురోగతితోనే దేశాభివృద్ధి సాధ్యమని, మారుతున్న ఆధునిక పరిణామాలకు అనుగుణంగా విద్యార్థులు నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వైస్‌ ఛాన్సలర్‌) ఎన్‌.వీ.ఆర్‌. జ్యోతికుమార్‌ పిలుపునిచ్చారు. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ , సాంకేతిక కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ’ఫ్యూజన్‌ – 2కే26’ పేరిట రెండు రోజుల జాతీయస్థాయి సాంకేతిక సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, సృజనాత్మకతను వెలికితీయడమే ధ్యేయంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ఆర్‌.రామచంద్ర అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ జ్యోతికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ అనంతపురం వీసీ హెచ్‌.సుదర్శనరావు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు పత్ర సమర్పణలు (పేపర్‌ ప్రజెంటేషన్లు), ప్రాజెక్ట్‌ ప్రదర్శనలు, క్విజ్‌ పోటీల్లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ జె.లత, సదస్సు కన్వీనర్‌ డి.గౌసియా బేగం, సహ కన్వీనర్లు డాక్టర్‌ పి.ఆర్‌. రాజేష్‌ కుమార్‌, యూ.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement