ఫార్మసీ ఫలితాలు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఫార్మసీ ఫలితాలు విడుదల

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

అనంతపురం: జేఎన్‌టీయూఏ పరిధిలో గత ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నిర్వహించిన ఎం.ఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మా–డి పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. www. jntuaresults.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ప్రయాణికురాలి మెడలోని గొలుసు మాయం

● బాధితురాలి ఫిర్యాదును తీసుకోని పోలీసులు

గుత్తి: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న లక్ష్మిదేవి అనే ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసు దొంగలు అపహరించారు. గుంతకల్లు మండలం ఇమాంపురానికి చెందిన లక్ష్మిదేవి గుత్తి బస్టాండ్‌లో అనంతపురం వెళ్లేందుకు బస్సు ఎక్కింది. శివారు ప్రాంతంలోని మాతృశ్రీ ఆస్పత్రి వద్దకు వెళ్లగానే లక్ష్మిదేవి మెడలోని నాలుగు తులాల గొలుసు కనిపించలేదు.వెంటనే అప్రమత్తమైన ఆమె.. బస్సు ఆపాలని చెప్పింది. అయితే డ్రైవర్‌ బస్సును ఆపకుండా పామిడి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లాడు. కాగా, చోరీ జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, గుత్తిలో ఫిర్యాదు చేసుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో బాధితురాలు గుత్తికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు ఇస్తుండగా తీసుకోలేదు. గుత్తి, పామిడి పోలీస్‌ స్టేషన్లలో రెండుచోట్లా ఫిర్యాదు తీసుకోకపోవడంతో బాధితురాలు లబోదిబోమంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement