ప్రజల ఓటు హక్కును కాలరాస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఓటు హక్కును కాలరాస్తే సహించం

Oct 30 2026 1:21 AM | Updated on Oct 30 2026 1:21 AM

అనంతపురం న్యూటౌన్‌: ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల హక్కు అని వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్‌ విభా గం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి అన్నారు. ప్రజల ఓటు హక్కును కాలరాస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో స్థానిక సంస్థల ఎన్నికలు – కూటమి నేతలు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు స్పష్టత కల్పించాలంటూ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు, దాడులు చేస్తూ రాక్షస పాలన చేస్తూ ఎన్నికలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థలను ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా నిర్వహించి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కోరారు. పార్టీ పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి కిరణ్‌ కుమార్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు వెన్నపూస చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement